కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం కుదురుకోవటం పక్కా. అమెరికా , నాటో దళాలకు చెందిన ఆఖరు సైనికుడూ ఆఫ్గన్‌ని వీడాడు. ఇక వారికి ఎదురు లేదు. అయితే ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే తెలియదు. కానీ మన విషయం చూసుకుంటే కాశ్మీర్లో తాలిబాన్ల ప్రభావం ఉంటుందా అన్నది ప్రశ్న. కశ్మీర్ లోయకు తాలిబాన్లను మళ్లిస్తారా…లేదా అన్నది మరో పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక వేళ అదే జరిగితే ఇప్పటికే […]
బీజేపీ నాయకులు.. తెలంగాణలో అందివచ్చిన వేవ్ ను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నట్టే కనిపిస్తోంది. దుబ్బాకలో గెలుపు ఇచ్చిన కిక్ తో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లో అందిన అనూహ్య విజయం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. ఇది కొనసాగించడంతో పాటు.. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అడుగులకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో.. బండి సంజయ్ విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీపైనా విమర్శల దాడి చేస్తున్నారు. ఈ వేడిని మరింత […]
కరోనా మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడిపోతుంది. కంటికి కన్పించకుండా ఈ మహమ్మరి ప్రపంచాన్ని మొత్తాన్ని కబలించేస్తోంది. ఈ వైరస్ దాటికి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మృత్యు అంచులదాకా వెళ్లి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. భారత్ లోనూ కరోనా ప్రభావం భారీగానే కన్పించింది. అక్టోబర్లో థర్డ్ వస్తుందన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ స్వామినాథన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కరోనా ఫస్ట్ […]
సైబరాబాద్ లో మందు బాబుల పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది లో డ్రంకెన్ డ్రైవ్ చేసిన 2119 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసారు. నగరంలో 30 శాతం రోడ్ ప్రమాదాలకు డ్రంకన్ డ్రైవ్ కారణం. ఇక్కడ మొత్తం 802 డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు చోటు చేసుకోగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 745 మంది గాయలపాలయ్యారు ఈ ఏడాది లో 7 నెలల వ్యవధిలో 23,368 మంది పై డ్రంకన్ […]
భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 330 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 36,385 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,21,00,001కు పెరగగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,40,225 కు చేరింది.. మరోవైపు.. […]
తెలంగాణలో దిశ కేసు ఎంత సంచనలం రేపిందో అందరికి తెలుసు. ఆ కేసులు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ ఎన్ కౌంటర్ పై దిశ కమీషన్ విచారణ వేగవంతం వేగవంతం చేసింది. నేడు దిశ కమిషన్ ముందు మరోసారి ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలు హాజరు కానున్నారు. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ నమోదు చేసుకుంటున్న కమిషన్… ఇప్పటికే పలువురు సాక్ష్యులను విచారించింది. సిట్ […]
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ…రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. పాత రికార్డులను బద్దలు చేస్తూ…తన పేరిట లిఖించుకుంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ…అంతర్జాతీయ క్రికెట్‌లో 15వేల పరుగులు పూర్తి చేశాడు. మైదానంలో పరుగులతోనే కాదు.. సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లతోనూ….కెప్టెన్ కోహ్లీ రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఓ ఘనమైన రికార్డును అందుకున్నాడు. కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 150 మిలియన్లకు చేరుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీ. మొట్టమొదటి ఆసియా వ్యక్తి కూడా అతడే. […]
పారాలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్లు తమ జోరును కొనసాగిస్తున్నారు. తాజాగా మిక్సిడ్50 మీ పిస్టల్ షూటింగ్ లో భారత షూటర్లు మనీష్, సింగ్‌రాజ్ రెండు పతకాలు సాధించారు. ఈ విభాగంలో మొత్తం 218.2 పాయింట్లతో కొత్త పారాలింపిక్ రికార్డు సృష్టించి షూటర్ మనీష్ స్వర్ణం గెలిచాడు. అలాగే మరో షూటర్ సింగ్‌రాజ్ 216.7 పాయింట్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పటికే పారాలింపిక్స్ 2020 లో 2 స్వర్ణ పతకాలు, 6 రజతం, 5 కాంస్యలతో […]
పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పతకాలు కొల్లగొడుతూనే ఉన్నారు. అవని లేఖరా… ఒకే పారా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. పతకాల పట్టికలో ఇండియా 37వ స్థానంలో నిలిచింది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…ఈ నెల 9న పారా ఒలింపియన్లను కలుసుకోనున్నారు. భారత దేశ బంగారు బాలిక అవని లేఖారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా పారాలింపియన్‌గా […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 25,829 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 35,821 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 156.3860 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం […]