ఎమ్మెల్సీ సీట్ల కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైందా ? మండలిలో ఖాళీ అవ్వబోతున్న సీట్లకు డిమాండ్ పెరిగిందా ? కొందరు కేబినెట్ విస్తరణ మీద ఆశలు పెట్టుకున్నారా ? మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు...ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా ? పార్టీ కోసం కష్టపడిన, సీట్లు త్యాగం చేసిన వారికి...పార్టీ గుర్తింపు ఇస్తుందా ? రేసులో ఉన్న నేతలు ఎవరు ?
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు రైస్ మిల్లులలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్తెనపల్లిలో అనేక మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.
చాలా వరకు 70 శాతం మంది పలు అలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్యా్న్సర్‌పై అవగాహన చాలా అవసరమన్నారు. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్‌ల బారిన పడుతున్నారని మంత్రి వెల్లడించారు.
పులివెందుల ఎమ్మెల్యే నోటి నుంచీ వినకూడని మాటలు వస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఎవరున్నా.. మా కుటుంబ సభ్యులను సైతం నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి లా అండ్ ఆర్డర్ లేదని అనటం ఆశ్చర్యంగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. దళిత మంత్రి మీద విమర్శలు చేసి ఊరుకున్నారని.. లా అండ్ ఆర్డర్ గురించి ప్రశ్నించాల్సింది చంద్రబాబుని అంటూ ఆయన పేర్కొన్నారు.చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదన్నారు. దళిత మహిళ కాబట్టి పడుతుంది అని పవన్ ఆమెపై విమర్శలు చేశారన్నారు.
2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై.. పుష్కరకాలంగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ ఏడాది సైతం రండి.. తరలిరండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి నెలకొన్నాయని.. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు కాబట్టి ప్రశ్నించే స్వరం లేకుండా అణిచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా హామీల అమలు లేదని మండిపడ్డారు.