సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన సుమారు వంద మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడులో ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలోని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామమైన తారువలో ఉద్రిక్తత ఏర్పడింది. బూడి ముత్యాల నాయుడు, ఆయన కుమారుడు బూడి రవిల మధ్య గొడవ రాజకీయ రచ్చకు దారితీసింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ముస్లిం మైనారిటీ జేఏసీ నేతలు కలిశారు. ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డితో జేఏసీ నేతలు చర్చించారు.
జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. "కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?.. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్‌లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?.. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?.. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. -సీఎం జగన్. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్.. 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?" అంటూ సీఎం జగన్ చంద్రబాబును ప్రశ్నించారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గం కూటమి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బాపులపాడు మండలం కె. సీతారామపురం, కొయ్యూరు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.