విశాఖ:- 2024 నాటికి టీడీపీ పార్టీ ఖాళీ అవుతుందని… ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుందని వైసీపీ ఎండీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నాయకులు మాతో టచ్ లో వున్నారు..చర్చలు జరుగుతున్నాయన్నారు. పనితీరు ఆధారంగా అందరికీ సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ నుంచి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో ముఖ్య నాయకులు చేరారు. గతంలో టిక్కెట్లు ఆశించి పార్టీ నుంచి బయటకు వెళ్లిన నాయకులను తిరిగి అహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. […]
రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఈ పర్యటనలో అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం) ను సందర్శించనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు. ఇక ఎల్లుండి (16.11.2021) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్ కుమార్. మార్కెట్ లో […]
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్…సంచలన నిర్ణయాలతో.. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. చిల్డ్రన్స్ డే సందర్భంగా TSRTC ఎండీ వీసీ సజ్జనార్ పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు బస్సుల్లో టికెట్ ఉండదని, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు. ఏసీ, మెట్రో […]
తిరుపతిలో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. సౌత్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్‌గా ఉండగా… ఏపీ ముఖ్యమంత్రి YS జగన్… వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ఆతిథ్య నిర్వహణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఇవాళ తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు.. ఏపీ, తమిళనాడు, […]
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. నాయకుల మధ్య ఉన్న విభేదాలను మరోసారి భగ్గుమనేలా చేసింది. ఓటమికి గల కారణాలపై చర్చించేందుకు ఢిల్లీకి పిలిచిన అధిష్టానం, తెలంగాణ నాయకులతో వార్‌రూమ్‌లో సుధీర్ఘంగా చర్చించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక దానికి ముందూ, వెనుకా జరిగిన పరిణామాలన్నింటిపైనా ఆరా తీసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముందు జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పంచాయితీలో టీ.కాంగ్ నేతలు ఉత్తమ్, రేవంత్ వర్గాలుగా విడిపోయారు. ఓటమికి […]
ఇండియా ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,271 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 285 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 11,376 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 3,38,37,859 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రస్తుతం దేశ్యాప్తంగా […]
కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. మూడో రోజైన నేడు సింహాచలేశునికి హరిచందన పూజ, సింహాద్రి అప్పన్న కల్యాణ వైభోగం, చందనాల స్వామికి పల్లకీ ఉత్సవం, అహోబిలం శ్రీరామానుజ జీయర్ స్వామి ఆశీర్వచనం, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనామృతం లాంటి విశేషాలతో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోంది. కాగా.. ఈ నెల 12 తేదీన సాయంత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి కోటి దీపోత్సవం […]