ప్రస్తుతం దేశంలో ఓటీటీ, గేమింగ్ కు ఆదరణ పెరుగుతోందని…తాను కూడా ఓటీటీకి అభిమానిని అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆసియాలోని అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ ‘ఇండియాజాయ్’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టెక్నికలర్ ఇండియా కంట్రీ హెడ్, సిఐఐ నేషనల్ ఏవిజిసి సబ్ కమిటీ ఛైర్మన్ బీరెన్ ఘోష్, మొబైల్ ప్రీమియర్ లీగ్ సహ వ్యవస్థాపకులు & సీఈఓ శ్రీ సాయి శ్రీనివాస్, సినీ నటుడు […]
ఏపీలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26, 514 శాంపిల్స్ పరీక్షించగా.. 191 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 416 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,00,31,083 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,286 కు […]
నల్లగొండ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఊహించన షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు నల్గొండ పోలీసులు. బండి సంజయ్ కుమార్ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని… ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేకుండా పర్యటన సరికాదన్నారు జిల్లా ఎస్పీ రంగనాథ్. నిన్నటి బండి సంజయ్ నల్గొండ జిల్లా […]
తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయా? కేసీఆర్ ఫోకస్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయిందా? ఇప్పుడు ఆయన బీజేపీపై చేస్తున్నది ఉత్తుత్తి ఫైటేనా? లేదంటే మ్యాటర్ నిజంగానే సీరియస్సా? తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉప ఎన్నిక తమకు లైట్ అని గులాబీ పార్టీ నేతలు అంటే అనొచ్చు. కానీ దాని తాలూకు ఓటమి అనేకల రకాలుగా ఆ పార్టీ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు వైసీఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. రైతుల కడుపు కొట్టి, బడులను బంద్ పెట్టి, బార్లకు “రండి బాబు .. రండి” అంటూ డోర్లు తెరుస్తున్నాడని… దీనిపై సీఎం కేసీఆర్ సిగ్గుపడాలని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి… ఇంటికో తాగుబోతుని తయారు చేస్తున్నాడని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. ఆదాయం పెంచుకొనే తెలివి లేక లిక్కర్ మీద […]
ట్రాఫిక్ రూల్స్ వాహనదారులకు షాకిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే… ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ట్రైనిగ్ ఇనిస్టిట్యూట్ కు పోలీసులు పంపిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘటనలకు […]
టీడీపీ పార్టీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. లోకేష్ ఎన్ని జన్మలు ఎత్తినా.. ఎమ్మెల్యే అవ్వగలడా…? అంటూ చురకలు అంటించారు. వైజాగ్ కు పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉన్నాయి.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ నుండి తాము పారిపోమన్నారు.ఈ రాష్ట్రంలో మాకో అడ్రెస్ ఉంది..ప్రతిపక్ష నేతలే వలస పక్షులు అంటూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ మాకు మిత్ర పక్షం కాదని… తమకు బీజేపీ రాజకీయ మిత్రపక్షం కాదని తెలిపారు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో […]
ఓ కీలకమైన విషయానికి సంబంధించి ప్రభుత్వం ఆ పెద్దాయన్ని సలహాదారుగా నియమించుకుంది. సలహాలతో ప్రభుత్వానికి సరైన గైడెన్స్ ఇవ్వడమో.. లేక సమన్వయమో చేయాలి. ఆ సలహాదారు మాత్రం టచ్ మీ నాట్‌గా ఉండిపోయారు. తాను చెప్పినా ఎవరూ వినరని నిస్తేజమా? నాకెందుకులే అనే భావనా? ఏదీ అర్థం కాకుండా ఉందట. మరి ఆయనకు పదవి ఇచ్చి ఏ లాభం అనే చర్చ అప్పుడే మొదలైపోయిందట. ఇంతకీ ఎవరాయన? ఉద్యమంలో ఉద్యోగులు.. సలహాదారు సన్మానాల్లో..! చంద్రశేఖర్ రెడ్డి. APNGO […]
ఆ జిల్లాలో నిర్వహించిన రైతు మహాధర్నాలో టీఆర్ఎస్ నేతలు వర్గపోరుకే ప్రాధాన్యం ఇచ్చారా? పెద్దల హితోక్తులు చెవికి ఎక్కించుకోలేదా? మిగతావాళ్లు కలిసి సాగినా.. అక్కడ వేర్వేరు శిబిరాలు ఎందుకు వెలిశాయి? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్ వాచ్! కలిసి నిరసనల్లో పాల్గొన్నది కొందరేనా? కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమాలను సక్సెస్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు పోటీపడ్డారు. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను […]
మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అనే చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో దుబారా ఖర్చులు తగ్గడం లేదు. సంస్థను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన సారథులు, ఉన్నతాధికారులు.. లగ్జరీ కార్ల కోసం ఆర్టీసీపై మరింత భారం వేస్తున్నారు. విమర్శలకు ఆస్కారం కల్పిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి సారథుల కోసం కొత్త కార్లు? ఆర్టీసీని ఆదరించండి, ఆర్టీసీ బస్సులు ఎక్కండి.. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోండి.. ప్రభుత్వం, ప్రజా రోడ్డు రవాణా […]