ఏపీలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ప్రళయంలోనూ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు కంటతడితో.. ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణల ఎపిసోడ్‌లో.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు రంగంలోకి దిగిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు.. వైసీపీ నేతల వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. రాజకీయాలతో సంబంధం లేని మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తన కుటుంబాన్ని […]
ఇండియాలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,488 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,10,413 కి చేరింది. ఇందులో 3,39,22,037 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,22,714 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 313 మంది మృతి చెందారు. దీంతో […]
ఇవాళ రాజస్థాన్ కొత్త మంత్రి వర్గం కొలువుదీరనుంది. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేసింది. శాసనసభలో 200 మంది సభ్యుల సంఖ్య ప్రకారం.. కేబినెట్‌లో గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్ నేత సచిన్ పైలట్ వర్గానికి మంత్రి వర్గ విస్తరణలో ప్రధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పైలట్ టీంకు మెజార్టీ […]
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం, రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో కుల గణన., తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సమరానికి సిద్ధమయ్యారు. […]
టీ-20 సిరీస్ వైట్‌వాష్‌పై కన్నేసింది రోహిత్‌సేన. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా…చివరి ఫైట్‌కు రెడీ అయ్యింది. ఈ సిరీస్ తర్వాత టెస్టు ప్రారంభం కానుండటంతో కొన్ని ప్రయోగాలు చేయనుంది. సొంత గడ్డపై టీమిండియా దుమ్మురేపుతోంది. టీ-20 సిరీస్‌లో ఇప్పటికే రెండింటిలో గెలిచిన సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కేప్టెన్సీలో టీమిండియా అందుకున్న తొలి టీ20 సిరీస్ ఇదే. అదే ఊపుతో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.న్యూజిలాండ్ ఇంకా బోణీ కొట్టలేదు. తొలి […]
మేషం:- అందరితో కలుపుగోలుగా మెలిగి మన్ననలు పొందుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. చేతి వృత్తి వ్యాపారులకు కలిసివస్తుంది. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. వృషభం: – భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు పుణ్యక్షేత్ర […]
తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు ప్రజల్లో ఇటు పార్టీలో… అసంతృప్తి రాకుండా ఉండేందుకు ఇప్పటినుంచే… కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. అయితే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రగతి భవన్ లో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా 12 మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. అయితే ఈ […]
టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టిన ఎపిసోడ్ పై నారా రోహిత్ తన దైన స్టైల్ లో స్పందించారు. వైసీపీ పార్టీ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. పశువుల కంటే హీనంగా కొందరు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని నారా రోహిత్ వ్యక్తులు చెరిగారు. సమస్యల గురించి చర్చించాల్సిన అసెంబ్లీలో చంద్రబాబు ను, ఆయన సతీమణి భువనేశ్వరి ని దూషించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. రాజకీయాలపై అలాగే విధానాలపై విమర్శలు ఉండాలి కాని కుటుంబ […]