టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టిన ఎపిసోడ్ పై నారా రోహిత్ తన దైన స్టైల్ లో స్పందించారు. వైసీపీ పార్టీ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. పశువుల కంటే హీనంగా కొందరు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని నారా రోహిత్ వ్యక్తులు చెరిగారు. సమస్యల గురించి చర్చించాల్సిన అసెంబ్లీలో చంద్రబాబు ను, ఆయన సతీమణి భువనేశ్వరి ని దూషించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు.
రాజకీయాలపై అలాగే విధానాలపై విమర్శలు ఉండాలి కాని కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం హక్కును దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ పై మండిపడ్డారు. చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని కోవడం వారి భ్రమే అవుతుంది అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్నారని… అందుకే వారి మనుగడ సాగిందని అని నారా రోహిత్ అభిప్రాయపడ్డారు. శిశుపాలుడి లాగే… నిన్నటితో వారి 100 తప్పులు పూర్తయ్యాయని ఇక వారి అరాచకాన్ని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.