నాగశౌర్య ‘లక్ష్య’ విడుదల తేదీ ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 29వ తేదీన యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం విడుదలై మోడరేట్ సక్సెస్ ను అందుకుంది. తాజాగా అతని మరో సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. నిజానికి నాగశౌర్య మేకోవర్ తో తెరకెక్కిన ‘లక్ష్య’ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సింది. కానీ దీనిని డిసెంబర్ కు వాయిదా వేశారు. అయితే నాగశౌర్య నటించిన ఈ 20వ సినిమా రిలీజ్ డేట్ ను బుధవారం నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ప్రకటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాను డిసెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగ శౌర్య లుక్, ఆ హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కు పెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, సినిమా మీదున్న అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషనల్ కార్యక్రమాలను త్వరలో మొదలు పెడతామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమా కోసం విలువిద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగశౌర్య, ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని సమకూర్చగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!