టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.అసైన్డ్ భూముల జీవో కేసులో చంద్రబాబుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలంది సీఐడీ. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. అమరావతిలో అసైన్డ్ భూముల కోసం చట్ట వ్యతిరేకంగా జీఓ 41 తీసుకువచ్చారన్న సీఐడీ..ఈ జీవో ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం, ఏపీ సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొంది. చంద్రబాబు పిటిషన్ కొట్టేయాలని కోరింది సీఐడీ. అసైన్డ్ భూముల విషయంలో […]
పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్ట్ అయ్యారు. జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధును భీమవరంలో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పుట్టమధును ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు మాత్రం చెప్పలేదు. ఏ కేసులో పుట్ట మధును అరెస్ట్ చేశారో చెప్పడానికి పోలీసులు నిరకరించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో […]
వాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కొవిడ్ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు వెల్లడించింది సర్కార్. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. రెండో డోస్ వాళ్లకు ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం. పోర్టల్ లో సమస్య ఉంది.. దాని కోసం కేంద్రాన్ని.. సాఫ్ట్వేర్ లో […]
మేషం : ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. మిత్రుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటి విషయాలు పట్ల శ్రద్ధ వహిస్తారు. వృషభం : స్త్రీలకు రచనలు, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలలో […]
సిఎం కెసిఆర్ పై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కరోనా పరిస్థితి దారుణంగా ఉందని.. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. “తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని తేలిపోయింది. పగటి పూట నియంత్రణలేమీ లేవు. మరోవైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు స్వల్పకాల లాక్‌డౌన్ విధించాయి. మరి తెలంగాణ విషయానికి వచ్చే సరికి […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇక ఇండియాలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో కరోనా కట్టడికి రాజకీయ నాయకులతో పాటు, క్రికెటర్లు, సిని స్టార్లు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రజల కష్టాలను చూస్తే బాధ కలుగుతుందని.. అందుకే తన భార్య అనుష్క శర్మతో […]
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని వర్గాలకు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. గర్భిణీ మహిళలు, వికలాంగ ఉద్యోగులకు పూర్తిగా ఇంటి నుంచే పని చేసే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ-డీఓపిటి ఉత్తర్వులు రిలీజ్ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ లో నివసించే ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పని చేసేందుకు […]
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లతో జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశీలకులుగా వచ్చిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం అయ్యారు.ఈ సందర్బంగా ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ విషయం చాలా […]
“కోవిడ్-19” విపత్తు నేపథ్యంలో ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. “రెండవ విడత” కరోనా విపత్తులో దేశం విలవిల్లాడుతోందని..ఎలాగైనా సరే ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఆరుగురి “కోవిడ్” బాధితుల్లో, ఒకరు భారతీయుడు ఉన్నాడని లేఖలో పేర్కొన్నారు. దేశ జనాభా, జనసాంద్రత నేపథ్యంలో వైరస్ శరవేగంగా అనేక రూపాంతరాలతో విజృంభిస్తోందని.. నియంత్రణ లేకుండా వైరస్‌ను వదిలేయడం వల్ల దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు అని పేర్కొన్నారు. వైరస్ రూపాంతరాలపై “జీనోమ్ […]
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ విధించే విషయం గురించి సిఎం కెసిఆర్ లోతైన విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…..తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం […]