మంగళగిరి సిఐడి కార్యాలయమలో మూడోసారి విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమా హజరయ్యారు. ఈ సందర్బంగా దేవినేని ఉమా మాట్లాడారు. రెండు రోజుల పాటు రోజుకు 9 గంటల పాటు విచారణ చేశారని..మళ్లీ మూడో రోజు విచారణకు రావాలని పిలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానంద హత్య కేసులో విజయసాయిరెడ్డిని, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావును విచారణ జరిపితే ఈపాటికి నిజాలు తెలిసేవని.. 41 క్రింది నాకు హైకోర్టు బెనిఫిట్స్ ఇస్తే అధికారులు దాన్ని కాల రాస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను విచారణ పేరుతో ఇబ్బందులు గురిచేస్తున్నారని.. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే..మాపై తప్పుడు కేసులు పెట్టి విచారణ చేపట్టారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యం మేలుతుంది..విచారణలో అన్ని చెప్పినప్పటికీ కావాలని రోజుల తరబడి విచారణకు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులు సందర్శించాలని డిమాండ్ చేశారు.