కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటి నుండి ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించారని… వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయని వెల్లడించారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇతర రాష్ట్రాలు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయని… కాబట్టి కరోనాతో మృతి చెందిన […]
టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 309 కోట్లు కేటాయించి సిఎం జగన్ గారు ప్రజల పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలతో పాటు 50 క్రయోజనిక్ ట్యాంకర్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇక ప్రాణవాయవుకు కొరత ఉండదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగావు. పచ్చ మాఫియాను సృష్టించి రాష్ట్రాన్ని […]
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమారుని మృతి వార్త తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్న కన్న కొడుకు కరోనా వచ్చి చనిపోగా.. ఈరోజు తల్లితండ్రులు చనిపోవడంతో అందరి మనసులను కలిసివేసింది. వివరాల్లోకి వెళితే.. వంపుగూడకు చెందిన పిసరి హరీష్ రెడ్డి( 31) కరోనా సోకింది. కరోనా […]
ఏపీకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ-టీఎస్ బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు టీఎస్ పోలీసులు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇస్తున్నారు టీఎస్ పోలీసులు. ఆసుపత్రుల అనుమతి లేకుండా కరోనా పేషేంట్ ను ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్తున్న అంబులెన్స్ లను నిలిపివేస్తున్నారు టీఎస్ పోలీసులు. ఇందులో భాగంగానే జగ్గయ్యపేట బోర్డర్ దగ్గర […]
కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి ) మృతి చెందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్ పై వైద్యం అందించినా.. ఆయన పరిస్థితి మెరుగు పడలేదు. ఆయన ఆరోగ్యం మరింత చేయి దాటడంతో.. కాసేపటి క్రితమే టీఎన్ఆర్ మృతి చెందారు. కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో టీఎన్ఆర్ మృతి చెందారు. ఆయన మృతి వార్తా వినగానే..ఇటు జర్నలిస్ట్ లోకం, అటు చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్ళింది. యూ-ట్యూబ్ […]
కెసిఆర్ సర్కార్ పై మరోసారి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని మండిపడ్డారు. “తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని సీఎం కేసీఆర్ గారు పదేపదే నిరూపిస్తున్నారు. రాష్ట్రాన్ని దాదాపు నెలన్నరగా కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో వేధిస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు ఒక ప్రణాళిక లేకుండా ఆదరాబాదరాగా ఏం తోస్తే అది చేస్తున్నారు. వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభం… సిబ్బంది […]
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను సీఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు. సీఎం కేసిఆర్‌తో ఫోన్లో మాట్లాడిన హర్షవర్థన్ ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సమీక్షా సమావేశానంతరం […]
తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులకు సిఎం కెసిఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్ననేపథ్యంలో, మిగిలిన మరో 80 వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి కూడా వారికి అందిస్తున్న విధంగా 2000 […]
మేషం : రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికంగా ఉంటాయి. స్త్రీలకు విలాస వస్తువులు అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. అధికారులకు కింది స్థాయి సిబ్బంది సాదర వీడ్కోలు పలుకుతారు. ఆపద సమయంలో మిత్రులు ఉండగా నిలుస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు […]
మామిళ్ళపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నామని గనులు, భూగర్భశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 5 ప్రభుత్వశాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని..అయిదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక వస్తుందని ఆయన వెల్లడించారు. తక్షణం నష్టపరిహారం కింద మృతులకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షలు ప్రకటిస్తున్నామన్నారు. లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని.. ఘటనాస్థలాన్ని డిఎంజి నేతృత్వంలో వెంటనే మైనింగ్ అధికారులు పరిశీలించారని ఆయన తెలిపారు. క్వారీనిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని […]