తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లింది లారీ. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ, హోమ్ గార్డు ఎన్. ఎస్. రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుండి వస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వెహికిల్ కు ఎస్కార్ట్ గా వెళ్లేందుకు బ్రిడ్జి వద్ద ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి రెండు […]
తెలంగాణలోకి వచ్చే పేషెంట్లకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరి చేసిన సర్కార్… కోవిడ్ పేషెంట్ల అడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంబులెన్స్ లేదా వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని.. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తిరగడం వల్ల కూడా కరోనా వస్తుందని..పేర్కొంది సర్కార్. ఎపిడమిక్ యాక్ట్ […]
రైతులకు అండగా ఉంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణలో ఉన్న రైతు బంధు పథకం తరహాలో.. దేశవ్యాప్తంగా.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పథకంలో 9 కోట్లకు పైగా రైతులు చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి.. ఇక, పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతుకు ఏడాదికి రూ.6,000 అందజేస్తోంది మోడీ సర్కార్.. ఆ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తూ వస్తున్నారు.. అయితే […]
మేషం : ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. హోటల్, తినుబండరాల వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వారికి శుభదాయకం. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పవు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. సాహస యత్నాలు విరమించిండి. వృషభం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రుణం తీర్చడానికై చేయుయత్నాలు వాయిదాపడతాయి. షేర్ల అమ్మకం కంటే కొనుగోళ్లే లాభదాయకం మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. విద్యార్థులు […]
దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట విషాదం చోటు చేసుకుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు తండ్రి వెలంపల్లి సూర్యనారాయణ (80) గురువారం ఉదయం స్వర్గస్తులయ్యారు. విశాఖపట్నం బ్రాహ్మణ వీధిలో ఆయన తన స్వగృహంలో సూర్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో వెల్లంపల్లి తండ్రి సూర్యనారాయణ మృతి చెందారు. అయితే.. ఆయన మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. తన ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. […]
lockdown-effect-changes-in-the-working-hours-of-banksతెలంగాణలో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ్టి (గురువారం) నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్‌లో 50% సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నిన్న సమావేశమై.. ప్రభుత్వ నిర్ణయానికి సహకారం అందిస్తూనే వినియోగదారులకు కూడా సేవలు అందించాలని ఈ నిర్ణయం […]
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, సాయంత్రానికి చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడటం జరుగుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్లు ఇస్రో వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇటు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు […]
మేషం : రాజకీయాల్లో వారికి ఒత్తిడి, ఆందోళన తప్పదు. నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఆత్మనిగ్రహం చాలా అవసరం. స్త్రీలు విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. గతంలో నిలిపివేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయు యత్నాలు కలిసివస్తాయి. వృషభం : ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. రుణం తీర్చడానికే చేయు యత్నాలు వాయిదాపడతాయి. స్థిర చరాస్థుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకోవలసి వస్తుంది. స్టేషనరీ, […]
కరోనా సమయంలో అవసరం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్ సమయంలో వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా, […]
ప్రధాని మోడీకి ఏపీ సిఎం జగన్ మరో లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై ప్రధానికి సిఎం జగన్ లేఖ రాశారు. కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని సిఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని సిఎం జగన్ లేఖలో కోరారు. కోవాగ్జిన్ తయారీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయిందని, ఈ వ్యాక్సిన్ ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిఎం జగన్ తెలిపారు. […]