దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం “లాక్ డౌన్” పొడిగించారు సిఎం కేజ్రీవాల్. ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండనుందన్నారు. ఇక నుంచి కఠినమైన “లాక్ డౌన్” నిబంధనలు అమలు చేస్తామని… మే 10 వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు రద్దు కానున్నాయని సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. “మెడికల్ ఆక్సిజన్” అందుబాటు పరిస్థితి నిలకడగా ఉందని… దేశ రాజధానిలో కొత్తగా 17,364 “కోవిడ్” కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. 24 […]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒడిశా నుంచి ఎవరూ రాకుండా బోర్డర్ క్లోజ్ చేసేశారు ఏపీ పోలీసులు, అధికారులు. ఇచ్ఛాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే మినహాయింపులు ఇస్తున్నారు అధికారులు. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో ఒడిశా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఆంధ్రా ప్రాంతం నుంచి […]
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సిఎంగా ఉండి చంద్రబాబు పొడిచింది ఏముంది? అని మండిపడ్డారు. “ఈ ‘వారం రోజుల సిఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు? జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు. 14 ఏళ్లు సిఎంగా ఉండి పొడిచింది ఏముంది? ఏ స్కీమ్ వల్లనైనా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం […]
ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చుండూరు ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. సకాలంలో వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అసత్య ప్రచారాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనపై చుండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై శ్రావణి […]
మేషం: అందరితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వుంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీల కోరికలు నెరవేరకపోవడంతో కుటుంబంలో చికాకులు చోటుచేసుకుంటాయి. వృషభం: ఆర్థికంగా ఎంతో కొంత కలిసివస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు క్రీడలపట్ల అధికమవుతుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత ఆందోళన వంటివి ఎదుర్కొంటారు. కుటుంబీకులతో, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. […]
హనుమంతని జన్మస్థలంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. హనుమద్ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది టిటిడి. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అన్న ఆధారాల నివేదికను తీర్దక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులుకు పంపింది టిటిడి. టిటిడి చూపిన ఆధారాలు అసత్యాలు అయితే ఈ నెల 20వ తేదీలోపు ఆధారాలు సమర్పించాలని తీర్దట్రస్ట్ ప్రతినిధులను టిటిడి కోరింది. కరోనా తీవ్రత తగ్గిన తరువాత చర్చలకు సిద్దమని టిటిడి పేర్కొంది. టిటిడిపై హనుమద్ జన్మభూమి తీర్ద ట్రస్ట్ ఉపయోగించిన […]
చైనా రాకెట్ భూమిపై కూలే ప్రాంతాన్ని యూఎస్ రక్షణ శాఖ తాజాగా గుర్తించింది. ఆదివారం ఉదయం 4:30 గంటలకు రాకెట్ శకలాలు భూమిని ఢీకొంటాయని అంచనా వేసింది. మధ్య ఆసియాలోని తుర్క్ మెనిస్థాన్ లో కూలే అవకాశం ఉందని పేర్కొంది యూఎస్ రక్షణ శాఖ. అయితే చైనా మాత్రం ఈ విషయంలో పెద్దగా ప్రమాదం ఉండబోదనే చెబుతోంది. శకలాలు భూమిని చేరేలోపే పూర్తిగా కాలిపోతాయని, ప్రమాదం జైగే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతోంది. అయితే ఎక్కడ […]
ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల కరోనా పాజిటీవ్ రావటంతో పవన్ ఐసోలేషన్ లోకి వెళ్ళి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. మూడు రోజుల క్రితం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటీవ్ వచ్చిందని అయితే కరోనా తర్వాత పవన్ కొద్దిగా వీక్ గా ఉన్నారని ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని డాక్టర్ల బృదం తెలిపింది. అయితే […]
బాలకృష్ణ, మీనా మరో సారి జోడీ కట్టబోతున్నారు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తో పలు చిత్రాలలో సందడి చేసింది. ఆ తర్వాత పెళ్ళి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరం అయినా కూతురు పుట్టిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, మలయాళ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు చూపిస్తోంది మీనా. ప్రస్తుతం వెంకటేశ్ తో ‘దృశ్యం2’లో నటిస్తోంది మీనా. అంతే కాదు […]
కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఆ జిల్లాలోని పొరుమామిళ్ల మండలం మామిల్లపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్వారీలో ముగ్గురాయి వెలికితీత పనులకు వెళ్లిన కూలీలు…వెలికితీత సమయంలో ఒక్కసారిగా పేలుడు పదార్థాలు పేలాయి. దీంతో అక్కడికక్కడే 10 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం […]