విశాఖ మధురవాడ పరిధిలోని మారీక వలసలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 3 సంవత్సరాల చిన్నారిని కన్న తల్లి హతమార్చింది. అంతే కాదు గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో దహనం చేసింది. రెండు రోజుల నుంచి పాప కనిపించకపోవడంతో వరలక్ష్మీని స్థానికులు నిలదీశారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందుతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల సమక్షంలోనే నింధుతురాలు వరలక్ష్మీపై దాడికి ప్రయత్నించిన స్థానికులు.. రెండురోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించింది చిన్నారి. స్థానికుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు..ఈ రోజు ఎమ్మార్వో సమక్షంలోనే మృతదేహానికి పంచనామా జరిపారు. అయితే నిందితురాలు వరలక్ష్మీని తమకు అప్పగించాలని పోలీసుల వాహనానికి స్థానికులు అడ్డుపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులకు పోలీసులు సర్ధి చెప్పి నిందితురాలును జైలుకు తరలించారు.