ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లోనూ బిజేపిలో చేరుతున్నట్లు ఈటల ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈటల ఎప్పుడు బిజేపిలో చేరుతారనే దానికిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 11 తర్వాత బీజేపీలో ఈటల చేరనున్నారని తాజాగా సమాచారం అందుతోంది. అంతలోపే స్పీకర్ కు రాజీనామాను మెయిల్ చేయనున్నారు ఈటల. ఈటల చేరికపై ఇప్పటికే హుజురాబాద్ బీజేపీ నేతలతో మాట్లాడారు బండి సంజయ్. ఈటల చేరికపై హుజురాబాద్ స్థానిక నేతలు కూడా ఒకే చెప్పినట్టు సమాచారం. త్వరలో మరో trs నేత బీజేపీలో చేరతారు అంటున్నారు ఆ పార్టీ వర్గాలు. ఢిల్లీలో నడ్డా సమక్షంలో ఈటల, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ పార్టీలో చేరనున్నారు. అమిత్ షా అపాయింట్ మెంట్ కోసమే పార్టీలో చేరిక ఆలస్యం అయినట్లు సమాచారం. అమిత్ షా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎవరిని కలవడం లేదు. నడ్డా సమక్షంలో బీజేపీలో చేరాక… అమిత్ షాను కలవాలనే ఆలోచనతో ఈటల ఉన్నారు.