యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, 20 లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో పనులను వేగంగా పూర్తి చేయాలని అన్ని రకాల పనులను సమాంతరంగా కొనసాగించాలని సూచించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి యాదాద్రిని సందర్శించారు. తొలుత ఆలయ రింగ్ రోడ్ చుట్టూ పర్యటించి […]
స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు సర్కార్ అభివృద్ధిలో చాలా దూకుడుగా ముందుకు పోతోంది. కరోనా విషయంలో ఇప్పటికే.. కీలక నిర్ణయాలు తీసుకున్న సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సలహా మండలిలో భాగం కావాలని తమిళనాడు ప్రభుత్వం ప్రముఖ ఆర్థికవేత్తలను ఆశ్రయిస్తోందని గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ సోమవారం ప్రకటించారు. ఈ ఆర్థిక సలహా మండలిలో మాజీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో, మాజీ సిఇఎ అరవింద్ […]
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,14,399 కి చేరింది. ఇందులో 5,93,577 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో […]
జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యల కారణంగా… ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 2620 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,50,288 కు చేరింది. ఇందులో 17,79,785 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా […]
సీఎం కేసీఆర్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీని తిట్టడానికి అధికార వేదికలు వాడుకోవద్దని సూచనలు చేసిన రఘనందన్… కేసీఆర్ భాషను నియంత్రించుకోవాలని సూచించారు. యాక్షన్ కు రియాక్షన్ కూడా వస్తోందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు అని.. దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలు దేరాడని ఎద్దేవా చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేను దుబ్బాక ఎమ్మెల్యే కూడా […]
తెలంగాణ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతోందని..ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ 800 అడుగులు లోపు ఉంటే చుక్క నీరు తీసుకునే పరిస్థితి లేదని.. మాకు కేటాయింపులు ఉన్న నీటిని వాడుకోవటానికి ప్రాజెక్టులు కడుతుంటే అక్రమమని చెప్పటం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. కల్వకుర్తి, నట్టెం,పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు అన్నీ కేటాయింపులకు అదనంగా వాడుకోవటం కోసమే అన్నది వాస్తవం కాదా? కాల్వల వైడనింగ్ చేస్తున్నాం…అది కూడా తప్పంటే ఎలా? అని నిలదీశారు. […]
ఈటల రాజేందర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కురుక్షేత్ర యుద్ధం అని ఈటెల మాట్లాడుతున్నారని.. ఏడు సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం అంటే పేద వాడు మంచిగ బ్రతకడమేనని.. మాట్లాడితే బీసీ అంటున్న ఈటెల… నీ వ్యాపార భాగస్వాముల్లో ఎంత మంది బిసిలు ఉన్నారు?అని మండిపడ్డారు. బిసి అని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదని…ఈటెల రాజేందర్ పదవికి రాజీనామా చేయలేదు… బర్త్ రఫ్ చేశారని […]
తెలంగాణలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఈ నెల 25న ఆషాడమాసం బోనాలు నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత సంవత్సరం కరోనా కారణంగా బోనాలు నిర్వహించలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఘనంగా ఆషాడ బోనాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది తెలంగాణ సర్కార్. అటు జులై 11 న గోల్కొండ బోనాలు […]
కోవిడ్ 19 మలిదశ తీవ్రతతో ప్రధానిమోడీ బ్రాండ్ తగ్గిన బిజెపి కాయకల్ప చికిత్సల కోసం అవస్థ పడుతుంటే ఇతర పార్టీల పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. ఒక అనిశ్చితి అంతటా ఆవరించింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూడా ఎంతకూ కోలుకోలేకపోతున్నది. ఆ పార్టీ ముఖ్యనాయకులైన జితిన్ ప్రసాద్ వంటివారు బిజెపిలో చేరడం,రాజస్థాన్‌లో సచిన్‌పైలెట్ కేంద్రంగా అసమ్మతి పునరావృతం కావడం, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌పై నవజ్యోతి సిద్దు తదితరుల తిరుగుబాటు వంటివి ఎడతెగని సమస్యలుగా మారాయి.జితిన్ ప్రసాద్ నిష్క్రమణ […]
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మరో కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు కోర్ కమిటీ సమావేశం లేదు.. ఎలాంటి చర్చ లేదని… ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏంటని హనుమంతరావు పేర్కొన్నారు. కర్ణాటకలో పీసీసీ అంశం వివాదం అయితే పరిశీలకుడిగా మధుసూదన్ మిస్త్రీని పంపించారని… ఇక్కడ మాణిక్కం ఠాగూర్ తీసుకున్న నిర్ణయమే ఫైనలా […]