చెన్నై : తమిళనాడులో బయటపడ్డ అతి పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది. అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాలలో వేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. కారయంకురిచి గ్రామానికి చెందిన శరవణన్ స్థలంలో సుమారు ఎనిమిది అడుగుల రాతి స్వామివారి విగ్రహం దొరికింది. జెసిబి సహాయంతో విగ్రహాన్ని వెలికి తీశారు అధికారులు. విగ్రహన్ని బయటకు తీయగానే.. ఆ గ్రామస్థులు పూజలు నిర్వహించారు. read more : మరోసారి పెరిగిన పెట్రో ధరలు : హైదరాబాద్ […]
ఈ మధ్య ఆన్ లైన్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొందరు మోసగాళ్లు… బడా నాయకులను, ప్రముఖులను టార్గెట్ చేసి మరీ.. డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే.. తాజాగా కరోనా వ్యాక్సిన్లను అడ్డుపెట్టుకుని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిర్మాత సురేష్ బాబును వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సీన్ లు ఉన్నాయని లక్ష రూపాయలు కొట్టేశాడు ఆ కేటుగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ఓ కేటుగాడు తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్ […]
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.97.22 కాగా.. డీజిల్ రూ. 87.97 కు చేరింది. read also : ఇండియా కరోనా అప్డేట్ […]
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 42,640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,77,861 కి చేరింది. ఇందులో 2,89,26,038 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 6,62,521 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. read also : వాహనదారులకు ఊరట ! ఇక, గడిచిన 24 […]
కరోనా సెకండ్ వేవ్ మొన్నటి వరకు విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ కరోనా సెకండ్ కారణంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ను కేసీఆర్ సర్కార్ అమలు చేసింది. సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే లాక్ డౌన్ ను ఎత్తేసింది సర్కార్. అయితే.. ఈ లాక్ డౌన్ టైంలో కొందరు ఆకతాయిలు…. రూల్స్ బ్రేక్ చేస్తూ.. రోడ్లపై విచ్చలవిడిగా తిరిగారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా.. వాళ్ల బుద్ది మారలేదు. దీంతో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ […]
చైనాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్… చైనాలో నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను యూపీలోని నోయిడాకు షిఫ్ట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే శామ్‌సంగ్ సంస్థ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈఓ కెన్ కాంగ్ నేతృత్వంలోని శామ్‌సంగ్ ప్రతినిధి బృందం యూపీ సీఎం యోగిని కలిసింది. మెరుగైన పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడిదారుల- స్నేహపూర్వక విధానాల కారణంగా.. తమ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శామ్‌సంగ్ సంస్థ […]
ఇవాళ ప్రతిపక్షపార్టీలు సమావేశం అవుతున్నాయి… ఈ సమావేశానికి హాజరుకావ్సాలిందిగా..నిన్ననే శరాద్ పవార్, యశ్వంత్ సిన్హా, ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపిరారు. కేవలం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే కాకుండా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సహా బీజేపీకి వ్యతిరేకంగా సమిష్టి పోరాటానికి సిధ్ధమయ్యేందుకు సమాలోచనలు చేయనున్నారు.. ప్రతిపక్ష పార్టీలకు యశ్వంత్ సిన్హా కు చెందిన “రాష్ట్ర మంచ్” తరఫున ఆహ్వానాలు పంపారు.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు రావాలని ప్రతిపక్షాలకు ఆహ్వానాలు పంపించారు.. […]
సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈనెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ యాదాద్రిలో పర్యటించబోతున్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న గ్రామంలో ఇవాళ పర్యటించనున్నారు. read also : కేసీఆర్‌వి కొత్త అబద్ధాలు… తుగ్లక్ వాగ్దానాలు : రాములమ్మ సెటైర్ ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ గ్రామ సర్పంచ్‌కు […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి సెటైర్ వేశారు. అచ్చమైన తెలంగాణ భాషలో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా కరోనాకు పారాసిటమల్ చాలంటున్రు. జయశంకర్ గారి వర్ధంతిని జయంతి అంటున్రు. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి ఊసెత్తకుండా… ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నరు. డల్లాస్, చికాగో, న్యూయార్క్, ఇస్తాంబుల్ వాగ్దానాల యాది మరిచి, ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటున్రు. వీటిలో ఏ ఒక్కటీ […]
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి రూ.43,900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.47,890కి చేరిది. చాలా రోజుల తరువాత 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 వేల దిగువకు చేరడం […]