రేపట్నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు వర్తించనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 30వ తేదీ వరకు మారిన సడలింపు నిబంధనలు అమలు కానున్నాయి. దీంతో రేపట్నుంచి యధావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి. ఉదయం 09:30 గంటల నుంచి పని చేయనున్నాయి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు. […]
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డువచ్చాయి. దీంతో ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ఢీకొంటింది హరీష్ రావు పైలెట్ కారు. ఆ వెంటనే.. పైలెట్ కారును మంత్రి హరీష్ రావు వాహనం ఢీకొంటింది. ఈ ప్రమాదంలో ముందు కారులోని వ్యక్తికి […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1006 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 613202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1798 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,91,870 మంది డిశ్చార్జ్ అయ్యారు. read more : చిత్తూరు మేయర్ అముదపై వైసీపీ శ్రేణుల్లో చర్చ ! ఇప్పటివరకు […]
ఆమె ఓ ప్రజాప్రతినిధి. నగర ప్రథమ మహిళ. నగరంలో తొలి గౌరవం ఆమెకే దక్కాలి. కానీ.. అక్కడ ఆ సీన్ లేదట. కార్యాలయ సిబ్బంది సైతం ఆమెను పట్టించుకోవడం లేదని టాక్. దీంతో పెద్ద పదవిలో ఉన్నా.. తగినంత గౌరవం దక్కడం లేదని లోలోన ఆవేదన చెందుతున్నారట ఆ మహిళా ప్రజాప్రతినిధి. ఇంతకీ ఎవరామె? చిత్తూరులో మేయర్‌ను పట్టించుకోని పార్టీ నేతలు ఎస్. అముద. చిత్తూరు మేయర్. రాజకీయాలకు కొత్త. పొలిటికల్ ఎంట్రీలోనే కార్పొరేటర్ అయ్యారు. రిజర్వేషన్ […]
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేత ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని, […]
బీజేపీ నేత విజయశాంతి మరోసారి సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఎలా ఎత్తేస్తారని ఆమె ప్రశ్నించారు. ” తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని, ఇట్టే మోసం చెయ్యవచ్చనేది సీఎం కేసీఆర్ గారి గట్టి విశ్వాసం. నిన్నటి వరకూ కరోనా పేరిట పగలు కొన్ని గంటల పాటు, రాత్రి మొత్తం లాక్‌డౌన్ పెట్టి… చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ కరోనా కట్టడికి ఎలాంటి చర్యలూ ప్రకటించకుండానే ఉన్నట్టుండి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశారు. […]
లోకల్ ఫైట్ సమయంలో హీటెక్కిన అక్కడి రాజకీయం చల్లారలేదు. ఇంతలో తండ్రికి తనయుడు కూడా తోడయ్యారు. ఇద్దరూ కలిసి ప్రత్యర్థిని కార్నర్ చేస్తున్నారు. ప్రత్యర్థి కూడా తక్కువేమీ కాదు. ఒకే బ్లడ్. ఒకే కుటుంబం. ఏదైనా అంటే సర్రున లేస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ? మొన్నటి వరకు తమ్మినేని వర్సెస్ కూన శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిట్రిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమదాలవలసలో ఇప్పుడు సరికొత్త రాజకీయం రాజుకుంటోంది. ఏడాది క్రితం వరకూ మేనల్లుడు […]
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా? ఏళ్ల తరబడి ఒకే ప్లేస్‌లో పనిచేస్తున్న వారికి రిలీఫ్ లభిస్తుందా? ఎస్‌ఐ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఎదురు చూస్తున్న శుభ ఘడియ రానే వచ్చిందా? పోలీస్ శాఖలో జరుగుతున్న చర్చ ఏంటి? ఐదారేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఐపీఎస్‌లు! తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీ అనే మాట విని చాన్నాళ్లు అయింది. ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్ అన్నట్టు.. కుర్చీలకు అతుక్కుపోయి పనిచేస్తున్నారు అధికారులు. డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌ఐలదే […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల షాకింగ్ కామెంట్స్ చేశారు. తెరాస లేకుంటే నేను ఎక్కడ అని కొందరు అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాకు ఎమ్యెల్యే గా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ పుణ్యమా అని ఎమ్యెల్యే గా గెలిచినా అని.. మొదటి సారీ గెలవడం ఈజి.. కానీ రెండవ సారీ గెలవడం కష్టమన్నారు. 2023 తరువాత టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. తరువాత వచ్చే ప్రభుత్వంలో వచ్చే స్కీం చాలా […]
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 5646 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,50,563 కు చేరింది. ఇందులో 17,75,176 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 63,068 కేసులు యాక్టివ్ గా […]