స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు సర్కార్ అభివృద్ధిలో చాలా దూకుడుగా ముందుకు పోతోంది. కరోనా విషయంలో ఇప్పటికే.. కీలక నిర్ణయాలు తీసుకున్న సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సలహా మండలిలో భాగం కావాలని తమిళనాడు ప్రభుత్వం ప్రముఖ ఆర్థికవేత్తలను ఆశ్రయిస్తోందని గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ సోమవారం ప్రకటించారు. ఈ ఆర్థిక సలహా మండలిలో మాజీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో, మాజీ సిఇఎ అరవింద్ సుబ్రమణియన్, అభివృద్ధి ఆర్థికవేత్త జీన్ డ్రేజ్, మాజీ కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఎస్ నారాయణ్ ఉన్నారు. “ఈ కౌన్సిల్ సిఫారసుల ఆధారంగా, ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తుందని….ఆర్థిక వృద్ధి యొక్క ప్రయోజనాలు సమాజంలోని అన్ని విభాగాలకు చేరేలా చేస్తుందని గవర్నర్ పురోహిత్ అన్నారు. జిల్లాల పారిశ్రామిక స్థావరాన్ని వైవిధ్యపరచడం మ