పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి రూ.43,900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.47,890కి చేరిది. చాలా రోజుల తరువాత 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 వేల దిగువకు చేరడం శుభపరిణామం.
దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు కొంతమేర తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ఇక బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. కిలో బంగారం ధర రూ. 73,100 వద్ద స్థిరంగా ఉన్నది.