పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ నేడు చేస్తుంది. ఉగ్రవాదుల, గ్యాంగ్ స్టర్లతో లింకున్న కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలోని గుల్బార్గా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తారు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కూడా పేరు చేర్చినట్లు తెలిసింది.
రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో మోడీ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కును ఆయన ప్రారంభించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu) నివాసంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) బృందంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కూడా ఉన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. గతంలో యువగళం పేరుతో తాడిపత్రికి వచ్చి తనపై నిరాధారమైన ఆరోపణలు చేశాడు లోకేష్.. మరలా లోకేష్ శంఖారావం పేరుతో తాడిపత్రికి వస్తున్నాడు అని ఆయన తెలిపారు.
ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి స్పీడ్ పెంచారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పి వరుసగా సైకిలెక్కుతున్నారు.