అమెరికాలో హిందువులకు వ్యతిరేకంగా దాడులు పెరుగుతున్నట్లు పెరిగిపోతున్నట్లు ఆ దేశానికి చెందిన చట్టసభ ప్రతినిధి థానేదార్ పేర్కొన్నారు. హిందూఫోబియా(Hinduphobia)కు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. ఈ దేశంలో విద్వేషానికి చోటు లేదని ఆయన చెప్పుకొచ్చారు. బుధవారం నాడు క్యాపిటల్ హిల్‌లో కొన్ని హిందూ గ్రూపులతో జరిగిన భేటీలో థానేదార్ పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న విద్వేష నేరాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కూడా టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే హిందూ కాకస్‌ను ఏర్పాటు చేసినట్లు చట్టసభ ప్రతినిధి థానేదార్ వెల్లడించారు.
Read Also: Illegal Sale Ganja: గంజాయి విక్రయిస్తున్న కిలాడీ లేడీ.. టార్గెట్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లే
ఇక, అమెరికా కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి హిందూ కాకస్ ఏర్పాడింది అని చట్టసభ ప్రతినిధి థానేదార్ అన్నారు. మతస్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ కాకస్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మత వ్యతిరేకత, ద్వేషంపై యుద్ధం చేయాలన్నారు. అమెరికాలో ద్వేషం ఉండొద్దు.. అలాగే, మతపరమైన హక్కులను గౌరవించాలి అని ఆయన వెల్లడించారు. కాగా, కాలేజీ క్యాంపస్‌ల్లో ఎక్కువ శాతం హిందూ వ్యతిరేక దాడులు కొనసాగుతున్నాయని హిందూ అమెరికన్ ఫౌండేషన్ నేత సుహాగ్ శుక్లా చెప్పుకొచ్చారు. గడిచిన రెండేళ్లలో హిందూ వ్యతిరేక దాడుల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఖలిస్తానీ దాడులు కూడా పెరిగిపోతున్నట్లు ఆమె పేర్కొన్నారు.