Xiaomi 17 వచ్చేస్తోంది.. 7,000mAh బ్యాటరీతో పాటు కిర్రాక్ ఫీచర్లు
- భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో త్వరలో మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్..
- కొత్త హైఎండ్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 17 త్వరలోనే భారత్‌లో లాంచ్..
- 7,000mAh బ్యాటరీతో పాటు కిర్రాక్ ఫీచర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 17: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో త్వరలో మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ సందడి చేయనుంది. బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు మంచి క్రేజ్ ఉన్న షియోమీ.. తన కొత్త హైఎండ్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 17 ను భారత్‌లో త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా, ఈ ఫోన్‌కు సంబంధించిన ఇండియన్ వేరియంట్ Bureau of Indian Standards (BIS) వెబ్‌సైట్‌లో కనిపించినట్లు లీక్స్ వచ్చాయి.
Read Also: TheRajaSaab : రేపే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కానీ వెన్యూ మారింది..
Also Read
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
BIS సర్టిఫికేషన్‌లో Xiaomi 17?
BIS సర్టిఫికేషన్‌లో 25113PN0EI అనే మోడల్ నంబర్‌తో ఓ షియోమీ ఫోన్ R-41314803 నెంబర్ తో రిజిస్ట్రర్ అయింది. ఈ లిస్టింగ్‌లో స్పెసిఫికేషన్స్ బయటకు రాకపోయినా, భారత్ లో త్వరలోనే లాంచ్ చేసేందుకు సమయం దగ్గర్లోనే ఉండొచ్చు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, గత కొన్ని వారాల్లో ఈ ఫోన్ థాయిలాండ్ NBTC, సింగపూర్ IMDA లాంటి సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా దర్శనమిచ్చింది. తాజాగా Geekbenchలో గ్లోబల్ వేరియంట్ స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 5, 12GB RAM, Android 16 OSతో లిస్ట్ అయింది
Read Also: AI Danger For Kids: ‘చ*చ్చిపోవాలని ఉంది..!’ ప్రమాదంలో పిల్లల ప్రాణాలు.. ఈ తప్పులు చేయవద్దు!
చైనాలో ఇప్పటికే లాంచ్ అయిన Xiaomi 17..
సెప్టెంబర్‌లోనే చైనాలో Xiaomi 17, 17 Pro సిరీస్‌తో కలిసి విడుదలైంది. ఇది షియోమీ బ్రాండ్‌కు తొలి పూర్తిస్థాయి పవర్‌ఫుల్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక, Xiaomi 17 భారత్‌లో లాంచ్ అయితే, ఇప్పటికే ఉన్న Galaxy S Ultra, OnePlus, iQOO, Pixel లాంటి ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ధర వివరాలు
* చైనా మార్కెట్‌లో ప్రారంభ ధర: CNY 4,499 (సుమారు ₹56,000)
* బేస్ వేరియంట్: 12GB RAM + 256GB Storage
* భారత్‌లో కూడా ఇదే ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని రూమర్స్
* హార్డ్‌వేర్ కూడా చైనా వేరియంట్‌ను పోలి ఉండొచ్చు అని టాక్
అంచనా స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే:
6.3-అంగుళాల 1.5K OLED
120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్:
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్
కెమెరా:
వెనక లైకా-ట్యూన్ చేసిన ట్రిపుల్ కెమెరా సెటప్
50MP Primary (Light Fusion 950 Sensor + OIS)
50MP Telephoto
50MP Ultra-wide
50MP Front సెల్ఫీ కెమెరా
స్టోరేజ్ & RAM:
16GB RAM
1TB స్టోరేజీ
బ్యాటరీ & ఛార్జింగ్:
7,000mAh భారీ బ్యాటరీ
100W Wired Fast Charging
50W Wireless Fast Charging
తాజావార్తలు
-
‘Panchanama’ Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
-
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!