Rave Party: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి ప్యాకేట్స్, ఈ సిగరేట్, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అన్నారు. మా ప్రభుత్వం 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.. మరో 35 వేల ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు.
Telangana Medical Colleges: ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావించింది. తాజాగా 4 మెడికల్ కాలేజీలకు అనుమతి రావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరింది.
AP Deputy CM: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు.
Central Team: నేటి నుంచి వరద నష్టంపై తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించబోతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్& కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం.. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో సమావేశం కానుంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం పెద్దలను కలిసి తనను అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు.
Air Force Helicopter: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలోని పోర్పంధాల్ గ్రామంలో సోమవారం ఉదయం తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వెళ్తున్న శిక్షణ హెలికాప్టర్( IAF) అత్యవసరంగా ల్యాండ్ అయింది.