మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. . విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
Also Read:Anil Ravipudi : “‘మధుపానం.. ధనాధన్’ ట్రెండ్: అనిల్ రావిపూడి కీలక విన్నపం!”
రాజమౌళి గారి తర్వాత వరుసగా తొమ్మిది విజయాలు అందుకున్న దర్శకుడిగా రికార్డు సృష్టించారు.. మీ పదో సినిమాకి ఎంత జాగ్రత్త తీసుకోబోతున్నారు ? అని అడిగితే నిజానికి ఇది నాకు కాస్త కృషియల్ ఫేజ్. నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి ఒక పాజ్ ఇచ్చాను. మొన్న ఒక ఐడియా క్రాక్ చేసాము. ఈసారి టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఒక విచిత్రమైన జర్నీ స్టార్ట్ కాబోతోంది. స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యాను. ఇంకా యాక్టర్స్ ఫిక్స్ కాలేదు. జూన్, జూలైలో స్టార్ట్ చేయాలి. అది కూడా మంచి ఎంటర్టైనర్. నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా? అని అడిగితే ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ అన్నారు. రాజమౌళి గారితో మిమ్మల్ని పోల్చడం ఎలా అనిపిస్తుంది ? అని అడిగితే వరుస విజయాలు రావడంతో ఆ పోలిక వచ్చి ఉండొచ్చేమో కానీ .. డైరెక్టర్స్ గా ఆ కంపారిజన్ కి ఆస్కారం లేదు. దర్శకుడిగా ఆయన చేసే సినిమాలు వేరు. నేను చేసే సినిమాలు వేరు. డైరెక్టర్ గా ఆయన ఎంతో ఎత్తున ఉన్నారు. ఆయన నాకు ఇష్టమైన దర్శకుడు. నేను ఇప్పుడే ప్రయాణాన్ని మొదలు పెట్టాను. ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలి.