Vijayasai Reddy: కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగా.. సాయిరెడ్డి ఛలోక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీపై రాజ్యసభ వేదికగా సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా సమావేశమైన రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానంటూ ఛలోక్తులు విసిరారు. ఇక, తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెంకయ్యనాయుడని ఉద్దేశించి వ్యాఖ్యానించారు సాయిరెడ్డి.
Read Also: AP: జగన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరింది… అయ్యన్న ఫైర్..
Also Read
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఇక, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు విజయసాయిరెడ్డి.. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేష్‌కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందన్న ఆయన.. అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్ సభ్యులు నరేష్ గుజ్రాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రశంసలు కురిపించారు సాయిరెడ్డి.. ఆమె పనితీరును అభినందిస్తూ తాను అనేక పర్యాయాలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశమయ్యానని.. ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు.. టూరిజం, ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే టీజీ వెంకటేష్ కమిటీని అధిగమించడానికి కామర్స్ కమిటీ చైర్మన్‌గా తాను తాపత్రయపడుతుండే వాడినంటూ తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి