Anil Kumar Yadav: సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kumar Yadav: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వైరల్ ఏదో.. రియల్ ఏదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. తాజాగా, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా రకరకాల కథనాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.. దీనిపై ఘాటుగా స్పందించారు అనిల్.. సోషల్ మీడియాలోని ఓ వార్తా సంస్థ పేరుతో వచ్చిన అసత్య వార్తపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి.. ఎవరో కొంతమంది ఫేక్ గాళ్ళు.. ఫేక్ వార్తలతో అసత్య ప్రచారాలకు దిగినంత మాత్రాన ఒరిగేదేమీలేదన్నారు.. నా పేరును వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటూ.. సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని నేనన్న ఆయన.. మా తండ్రి వర్ధంతి నాడు మా తండ్రి సాక్షిగా చెప్తున్నా.. రాజకీయాలలో ఉన్నంతవరకు జగనన్నతోనే నా ప్రయాణం అన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
ఇక, జగన్మోహన్ రెడ్డి నన్ను తరిమేసే పరిస్థితి ఏనాటికి రాదన్నారు అనిల్ కుమార్ యాదవ్.. ఒకవేళ వచ్చినా.. తుది శ్వాస వరకు జగనన్న కోసమే పని చేస్తానని ప్రకటించారు. పేరుపొందిన గొర్రెలతో కలిసి గొర్రెగా ఉండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండడం మంచిది అనే సామెతను బాగా విశ్వసిస్తానన్న ఆయన.. మోకాలి సమస్య కారణంగా చికిత్స కోసం 15 రోజులు పాటు నగరానికి దూరంగా ఉండబోతున్నాను.. మీడియా దానిని వక్రీకరించి.. అనిల్.. జగన్ కు దూరం అవుతున్నాడు.. అనిల్ పని అయిపోయింది. అందుకే కనిపించడం లేదు. అంటూ తప్పుడు వార్తలు పెట్టకండి అని విజ్ఞప్తి చేశారు. 15 రోజుల చికిత్స పూర్తయిన అనంతరం.. జరిగే సమావేశాలలో ఆ చికిత్సకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించేందుకు కూడా నేను సిద్ధమే అన్నారు.. అన్ని విషయాల్లో కోపం.. ఆవేశం ప్రదర్శించినా.. ఒక్క సీఎం వైఎస్ జగన్ విషయంలో మాత్రం ఓపికగా ఉంటాను.. గెటవుట్… గెట్ లాస్ట్ అని జగన్ నాతో అన్నా.. నేను మాత్రం ఫాలోవర్‌గానే ఉంటానని ప్రకటించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!