వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింది మరోసారి నిధులు విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వరుసగా నాలుగో ఏడాది కూడా రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు నిధులు మంజూరు చేస్తోంది.. ఈ పథకం కింది 2,61,516 మందికి లబ్ధి చేకూరనుండగా.. రూ.261.51 కోట్లను ఖర్చు చేస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్ డ్రైవర్లకు ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున.. మొత్తంగా రూ.261.51 కోట్లను ఇవాళ విశాఖలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఒక్క బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేస్తారు.
Read Also: Contract Wedding: వైరల్‌గా మారిన కాంట్రాక్ట్ వెడ్డింగ్.. దిమ్మతిరిగే షరతులు..!
ఇక, ఇప్పటి వరకు ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లు పంపిణీ చేసినట్టు అవుతుంది.. ఇప్పటికే తాడేపల్లి నుంచి బయల్దేరిన సీఎం వైఎస్ జగన్.. ఉదయం 10.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. 11.05కు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకుని వైఎస్సార్ వాహన మిత్ర లబి్ధదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. అక్కడి నుంచి గోదావరి ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్లనున్నారు ఏపీ సీఎం.. ఆ తర్వాత వరదలు, నష్టం.. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు.