Contract Wedding: వైరల్‌గా మారిన కాంట్రాక్ట్ వెడ్డింగ్.. దిమ్మతిరిగే షరతులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్తొక వింత.. పాతొక రోత.. అన్నట్టుగా.. నేటి యువత కొత్తగా ఆలోచించి వార్తల్లో నిలిస్తున్నారు.. ముఖ్యంగా పెళ్లిలాంటి తంతులో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోరకంగా ఉంది.. ఇప్పటి వరకు పెద్దలు కుదిర్చిపెళ్లి, ప్రేమ పెళ్లి, రిజిస్ట్రేషన్ మ్యారేజ్, గుడిలో పెళ్లి లాంటివే చూశాం.. ఇప్పుడు ఓ కాంట్రాక్ట్ వెడ్డింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. వారి వివాహ వేడుక తర్వాత జంట ఒప్పందంపై సంతకం చేశారు వధూవరులు.. ఇక, ఆ జాబితాలో ఏముందో చూస్తే షాక్ తినాల్సిందే.. ఎందుకంటే.. ఒప్పందం ప్రకారం, వధువు ప్రతిరోజూ చీర ధరించాలి, అర్థరాత్రి పార్టీలు జీవిత భాగస్వామితో మాత్రమే వెళ్లాలి లాంటి షరతులు ఇప్పటిక నయా కపుల్స్‌కు పాటించడమే కష్టమే కదా? మరి..
Read Also: Internet: ఆ రాష్ట్రంలో సొంత ఇంటర్నెట్.. ఇండియాలో మొదటి రాష్ట్రంగా గుర్తింపు
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా జరిగిన ఓపెళ్లి, ఆ సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. అసోంకు చెందిన శాంతి మరియు మింటు.. పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి తర్వాత ఏం చేయాలి మరియు ఏం చేయకూడదో ఓ జాబితా తయారు చేశారు.. దానిపై ఇద్దరూ సంతకం చేశారు.. వెడ్‌లాక్ ఫోటోగ్రఫీ అసోం ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన దీనికి సంబంధించిన క్లిప్.. వైరల్ అవుతోంది.. తాము చేసుకున్న ఒప్పందాన్ని పెద్ద కాగితంపై ముద్రించారు.. దానిపై సంతకం చేసింది ఆ కొత్త జంట.. ఒప్పందం ప్రకారం, వధువు ప్రతిరోజూ చీరను ధరించాలి, అర్థరాత్రి పార్టీలు జీవిత భాగస్వామితో మాత్రమే వెళ్లాలి, ఆదివారం ఉదయం అల్పాహారం తుమ్ బానోగే అని కూడా రాసుకున్నారు.. నెలకు ఒకసారి పిజ్జా తినాలి, ఇంట్లో వంటనే మనం తినాలి.. అయితే, ఎవరు వంట చేయాలనే విషయాన్ని ప్రస్తావించలేదు, ఇద్దరం ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి, పార్టీలో మంచి మంచి ఫొటోస్ దిగాలి, ప్రతి 15 రోజుల తర్వాత షాపింగ్ చేయాలి వంటివి చేర్చారు..
అయితే, ఈ వివాహ ఒప్పందాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు.. మరికొందరు విసుగు చెందుతున్నారు.. ఆ ఫొటోలు, వీడియోలు షేర్ చూస్తూనే.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. భాయ్, ఇది వివాహం కాదు ఇది ఒప్పందం అని ఓ నెటిజన్ కామెంట్ పెడితే.. అన్ని షరతులు సరే.. కానీ, రోజువారీ చీర చాలా ఎక్కువ అని మరొకరు.. భారతదేశంలో ఇప్పటికీ చాలా అసమానతలు ఉన్నందుకు చాలా విచారంగా ఉంది అంటూ మరొకరు.. ఇలా కామెంట్లు పెడుతున్నారు.. మొత్తంగా.. రొటీన్‌కి భిన్నంగా జరిగిన ఈ ఒప్పంద పెళ్లి.. సోషల్ మీడియా రచ్చోరచ్చగా మారింది..
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!