YS Jagan Kadapa Tour: రేపటి నుంచి కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- కడప జిల్లాలో నాలుగు రోజుల పర్యటనకు సిద్ధమైన వైఎస్ జగన్..
- రేపటి నుంచి 4 రోజుల పర్యటన..
- రేపు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకోనున్న మాజీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Kadapa Tour: తన సొంత జిల్లాలో మరోసారి పర్యటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకోనున్న ఆయన.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఇడుపులపాయలోని చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప మున్సిపల్ కార్పొరేటర్లతో సమావేశమవుతారు. వారితో పాటు కడప నియోజకవర్గ వైసీపీ నాయకులతో కూడా ఆయన సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడ ఆయన నివాసంలో బస చేస్తారు…
Read Also: U23 State Trophy: మెరిసిన యువ సంచలనం.. 21 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన ఢిల్లీ ప్లేయర్
Also Read
ఇక, 25వ తేదీన ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు వైఎస్ జగన్… ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతం పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు.. మరోవైపు, 26వ తేదీన పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు.. ఇక, 27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి హాజరవుతారు. అనంతరం పులివెందుల నుంచి బయల్దేరి తిరిగి బెంగళూరు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
తాజావార్తలు
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!