U16 Davis Cup: U16 డేవిస్ కప్‌లో భారత్‌పై ఓటమి అనంతరం పాకిస్తాన్ ఆటగాడి అసభ్య ప్రవర్తన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. గత శనివారం జరిగిన ఆసియా-ఓషెనియా జూనియర్ డేవిస్ కప్ (అండర్-16) టోర్నమెంట్‌లో 11వ స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో భారత జట్టు 2-0తో పాకిస్తాన్‌ను ఓడించింది. భారత్ తరఫున ప్రాకాష్ సారన్, తవిష్ పహ్వా ఇద్దరూ తమ సింగిల్స్ మ్యాచ్‌లను స్ట్రైట్ సెట్లలో గెలిచి విజయాన్ని సాధించారు.
Read Also: Hajj Yatra 2025: సౌదీ అరేబియా అధికారిక ప్రకటన.. హజ్ యాత్ర అప్పటినుంచే ప్రారంభం..!
ఇకపోతే, మ్యాచ్ ముగిసిన మూడు రోజుల తర్వాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పాకిస్తాన్ ఆటగాడు భారత ఆటగాడిపై దురుసుగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ, దారుణమైన హావభావాలు ప్రదర్శిస్తూ కనిపించాడు. ఓసారి కాకుండా, మళ్లీ మళ్లీ అదే తీరుతో భారత ఆటగాడిని తక్కువ చేసేలా తన హావభావాలను ప్రదర్శించాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా కనిపించిన ఈ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక ఈ వీడియోను చూసినవారు అక్కడ భారత ఆటగాడు ఎంతో శాంతంగా, చాలా క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాడని, నిజమైన ఆటగాడి మాదిరిగా ప్రవర్తించాడని ప్రశంసిస్తున్నారు. ఈ విజయానికి ముందు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 9-12 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-2తో ఓడింది. డబుల్స్ మ్యాచ్‌లో సూపర్ టై బ్రేక్ వరకు పోటీ సాగగా, చివరకు భారత జట్టు 9-11తో ఓడిపోయింది.
Read Also: US Visa: విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశం.. ఆ కారణంతోనే..
ఈ ఘటన భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మే 7న పాకిస్తాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల అనంతరం రెండు దేశాల మధ్య ఘర్షణ తీవ్రతరమైంది. డ్రోన్ దాడులు, విద్యుత్ వ్యవస్థల అంతరాయం, జమ్మూకాశ్మీర్‌లో రెడ్ అలర్ట్‌లు వంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చి సద్దుమణిగినట్టయింది.
🇮🇳 India – 🇵🇰 Pakistan Handshake Drama at the Junior Davis Cup in Kazakhstan
India beat Pakistan 2-0 pic.twitter.com/mI85JBETCo
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) May 27, 2025