TDP Mahanadu: అట్టహాసంగా మహానాడు.. ఆరు ప్రధాన అంశాలు సభ ముందుకు..
- అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు..
- టీడీపీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు..
- కడపలో మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్న చంద్రబాబు..
- సార్వత్రిక ఎన్నికల్లో 57% ఓట్ షేరింగ్ సాధించామన్న సీఎం ..
- 3 విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం..
- ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం..
- ప్రతినిధుల సభలో 6 శాసనాలు ప్రతిపాదించిన నారా లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. 3 రోజులపాటు జరగనున్న మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. సభా వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మా తెలుగుతల్లికి గీతాలాపన చేశారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంతాపం తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయినవారికి సంతాపం ప్రకటించారు. భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. తిరుమల తొలిగడప, దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు కూటమికి కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం కోసమే కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో 57% ఓట్ షేరింగ్ సాధించినట్లు సీఎం వివరించారు. కార్యకర్తల పట్టుదల, శ్రమ వల్లే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయింది.
Read Also: UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
Also Read
43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నాం. పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ సర్వ నాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారు. చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చే 6 వేలతో కలుపుకొని మూడు విడతల్లో 20 వేలు చెల్లిస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు..
Read Also: Pakistan: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్కి ఎగబాకిన పాక్ ప్లేయర్
పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు నారా లోకేశ్. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదించారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవల్లో సోషల్ రీఇంజినీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత. అనే ఆరు శాసనాలను సభ ముందుంచారు లోకేష్. వెనుకబడిన కార్యకర్తల ఆర్థిక స్థితి గతులను మార్చడానికి ఇక నుంచి పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఉరసా సంస్థకు 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్టు జగన్ నిరూపిస్తే.. రాజీనామాకు సిద్ధమని లోకేశ్ సవాల్ చేశారు. ఇవాళ, రేపు కూడా మహానాడులో ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. మహానాడు ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహానాడుకు వచ్చినవారికి 30 రకాల వంటకాలతో పసందైన భోజనం వడ్డించారు. ఈ నెల 29న భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?