CM Chandrababu: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడపలో మహానాడు సూపర్ సక్సెస్ చేశారు.. కడప గడ్డపై మన సత్తా నిరూపించారు.. సూపర్ సిక్స్ హామీలు సాధ్యమా అన్నారు. కానీ అన్నీ హామీలు అమలు చేస్తున్నాం.. 17 నెలల్లో సూపర్ సిక్స్- సూపర్ హిట్ అయిందన్నారు. అలాగే, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, 20 లక్షల మందికి ఉద్యోగాలు, అన్నదాత సుఖీభవ పథకాలు అన్ని హిట్ అయ్యాయని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కలిసి చేస్తున్నాం.. ఇవాళ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Omar Abdullah: కొందరు చేసిన ఉగ్రదాడికి మొత్తం కాశ్మీరీలకు అవమానాలు..
అయితే, ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులతో కళకళలాడుతోంది అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాల నుంచి హాజరైన అన్నదాతలకు అభినందనలు తెలియజేస్తున్నాను.. రైతులకు ఏడాదికి 20 వేల రూపాయలను ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రెండో విడత ఇస్తున్నాం.. రెండో విడతలో రూ. 3, 135 కోట్లు జమ అయ్యాయి.. డైరెక్ట్ గా నగదు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి అని సూచించారు. ప్రతి ఒక్క రైతు అన్నదాత సుఖీభవ నిధులు వచ్చాయే లేదో మెసేజ్ చెక్ చేస్కోవాలని తెలిపారు. 46 లక్షలకు పైగా ఉన్న అన్నదాతలకు నిధులు జమ అయ్యాయి.. మన రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది.. చెప్పిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా నగదు వేస్తున్నాం.. మా చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.. రైతు భవిష్యత్ మార్చే మార్పు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Property Dispute: ఆస్తికోసం అమానుషం.. దత్తపుత్రుడి హక్కును అడ్డుకున్న సొంత సోదరుడు!
ఇక, రాష్ట్రంలో ఏ పంట వెయ్యాలో కూడా రైతులకు యాప్ నుంచే చెప్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమలో ఉద్యాన వన పంటలు బాగా పండించాలి.. అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశా.. అరకు కాఫీ, ప్రపంచంలోనే బెస్ట్ కాఫీగా నిలిచింది.. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పామాయిల్ వేస్తున్నారు.. కోకో ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఏపీ.. కోనసీమలో కోకొనట్ ఉంది.. కోకో, కాఫీ, కోకొనట్ ఈ మూడు కాంబినేషన్లో ఆహారం తయారు అవుతుంది.. రాయలసీమ హార్టీకల్చర్ హబ్ అవ్వాలని కోరారు. ప్రపంచంలో ఉన్న కంపెనీలు త్వరలోనే రాయలసీమకు రావాలని చంద్రబాబు అన్నారు.