Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- కడప జిల్లాలో 39 జడ్పీటీసీలు, కూటమి ఖాతాలోనే 23..
- 20 సీట్లున్న వాళ్ళకు జడ్పీ ఛైర్మన్ పదవి..
- మాకంటే మాకే కావాలంటూ పావులు కదుపుతున్న టీడీపీ, బీజేపీ..
- ఏకగ్రీవాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పుత్తా కృష్ణచైతన్య రెడ్డి..
- తండ్రి పుత్తా నర్సింహారెడ్డి కోసం కమలాపురం ఎమ్మెల్యే ప్రయత్నాలు..
- ఏకగ్రీవాల్లో తన మార్క్ చూపించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే..
- సోదరుడి కొడుకు కోసం ఆదినారాయణరెడ్డి ప్రయత్నాలు..
- పోటాపోటీగా పావులు కదుపుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వైసీపీ కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో ఆ పార్టీని టార్గెట్ చేసి పైచేయి సాధించడానికి కూటమి పార్టీలు గట్టిగానే ప్లాన్ చేశాయి. ఎక్కడికక్కడ, ఏ పార్టీకి ఆ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ఆ లైన్లోకి వచ్చాయి. కడప జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీలు ఉండగా అందులో 23 సీట్లను ఇప్పటికే ఏకగ్రీవం చేసుకుంది కూటమి. ఇక మిగిలిన 16 జడ్పీటీసీల ఎన్నిక నామ మాత్రమేనని అంటున్నారు. ఇక్కడ జడ్పీ చైర్మన్ పదవి దక్కాలంటే 20 మంది జడ్పీటీసీల బలం సరిపోతుంది. ఆ ప్రకారం చూస్తే… పోస్ట్ కూటమి ఖాతాలో పడిపోయినట్టే. కానీ… అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. కూటమి నాయకుల అంతర్గత కుమ్ములాటలతో… జిల్లా పరిషత్ పీఠం మీద ఎవరు కూర్చుంటాన్నది సస్పెన్స్ అయింది. మాకంటే మాకే కావాలంటూ టీడీపీ, బీజేపీ నాయకులు పోటీ పడుతుంటడంతో వ్యవహారం రసకందాయంలో పడింది. జడ్పీటీసీలను ఎలా ఏకగ్రీవం చేసుకోవాలి, ప్రత్యర్థుల్ని ఎలా అడ్డుకోవాలంటూ నిన్న మొన్నటి వరకు కలిసి ఎత్తుగడలు వేసిన నేతలు… ఇప్పుడు ఏ రూట్లో వెళితే మనకు ఛైర్మన్ పీఠం దక్కుతుందా అంటూ పావులు కదుపుతుండటం ఆసక్తి రేపుతోంది.
కడప జిల్లాలో కూటమి ఏకగ్రీవాల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిన నాయకుల్లో ముఖ్యుడు కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. అందుకే.. తన తండ్రి పుత్తా నరసింహారెడ్డిని ఛైర్మన్‌ని చేయాలన్నది ఆయన డిమాండ్. ఇక బీజేపీ తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తనదైన శైలిలో ఏకగ్రీవాల కోసం కృషి చేశారు. ఆయన కూడా… తన సోదరుడి కుమారుడు డాక్టర్ చదిపిరాళ్ళ రాజేష్ రెడ్డిని ఛైర్మన్‌ని చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. దీంతో… కడప కూటమి రాజకీయం రక్తి కడుతోంది. పుత్తా నరసింహారెడ్డి టిడిపి సీనియర్ లీడర్. ఎలాగైనా ఈసారి జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకుని జిల్లా వ్యాప్తంగా పెత్తనం చెలాయించాలని భిస్తున్నారట ఆయన. అందుకే రెండు చోట్ల నామినేషన్ వేశారు. చివరికి వీరపునాయన పల్లె జడ్పిటిసిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారాయన. అలాగే…. వరదరాజులురెడ్డి లాంటి జిల్లా టీడీపీ సీనియర్స్ అందరితో అంతర్గత సమావేశాలు పెట్టుకుని వాళ్ళ పరిధిలోని జడ్పీటీసీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారట. అదే సమయంలో కూటమిలో మేం కూడా భాగస్వామ్యమే కదా…. ఈసారి జడ్పీ సీటు కచ్చితంగా మాకే కావాలని అడుగుతున్నారట జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.
సోదరుడి కొడుకు రాజేష్ రెడ్డి కోసం ఆదినారాయణరెడ్డి వ్యూహాలు రూపొందించడం పొలిటికల్ కాక రేపుతోంది. నామినేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన ఆదినారాయణ రెడ్డి… కడప జిల్లా పరిషత్ కేంద్రం వద్ద జడ్పీటీసీ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడినట్టు సమాచారం.
Also Read
- YS Jagan: ‘మా టైమ్ వస్తుంది.. వడ్డీతో సహా చెల్లిస్తాం’.. జగన్ 2.0లో వేరే లెవల్ ఉంటుంది..!
- Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
- Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
- Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
అంతే కాకుండా.. నామినేషన్ల స్క్రూటినీ అయిపోయే వరకు దగ్గరుండి పరిశీలించారాయన. ఈసారి తన సోదరుడి కుమారుడు జడ్పీ చైర్మన్ కాబోతున్నారంటూ ప్రెస్మీట్లో ఓపెన్ కామెంట్స్ చేశారు జమ్మలమడుగు ఎమ్మెల్యే. ఈ పరిస్థితుల్లో… ఫైనల్‌గా ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ముందు జరిగిన ఏకగ్రీవాలను చూసి… కడప జడ్పీ ఛైర్మన్ పదవి ఇక పెద్ద మేటర్ కాదని అనుకుంటున్న సమయంలో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పోటాపోటీగా పావులు కదపడం, తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని పట్టుబట్టడం ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఎవరి అధిష్టానాల ద్వారా వారు వత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తుండటంతో… కడప కూటమిలో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!