Pulivendula Politics: కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో హై టెన్షన్ కొనసాగుతుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ సురేష్ రెడ్డికి పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సురేష్ రెడ్డితో పాటు వైసీపీ నేతలపై దాడి చేసిన 16 మంది టీడీపీ నేతలపై పులివెందుల పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అలగే, టీడీపీ తెలుగు యువత జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి, మా భాష, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, భాస్కర్, సంజీవ్ ,ఖాసీం, రహంతుల్లా, శివ, ధనుంజయ, ప్రశాంత్, శీను, రవి, మల్లికార్జున, అనిల్ తో పాటు పలువురిపై కేసు నమోదు అయింది.
Read Also: Bandi Sanjay: బీసీల కోసం కాదు.. ముస్లింల కోసమే కాంగ్రెస్ ధర్నా!
అయితే, జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలోని 160 మంది వైసీపీ నేతలపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఎర్రబల్లి, నల్లపురెడ్డిపల్లి తుమ్మలపల్లి, ఈ కొత్తపల్లి రాయలాపురం, అచ్చువెల్లి, నల్లగొండ వారి పల్లి మోటు నూతలపల్లి, కణంపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నేతలపై బైండోవర్ కేసులు నమోదు అయ్యాయి. మరి కొందరిపై బైండోవర్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. పోలీసు స్టేషన్ కు రావాలని పలువురికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పులివెందులలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న హై టెన్షన్ నెలకొంది.