Minister Gummanur Jayaram: వైసీపీ ఎమ్మెల్యేలెవరూ టీడీపీలో చేరరు.. 2024లోనూ జగనే సీఎం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gummanur Jayaram: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారు.. ఎప్పుడైనా మా పార్టీలో చేరతారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న మాట.. అయితే, ఈ ప్రచారాన్ని వైసీపీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. వచ్చే 2024 ఎన్నికల్లోనూ వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటున్నారు.. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పశువుల సంతలో కొన్నట్టు కొనడం ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Read Also: Dasara Twitter Review : నేచురల్ స్టార్ ఇరగదీశాడు.. దసరాపై ట్విట్టర్ రివ్యూ ఎంటంటే
Also Read
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
చంద్రబాబు, లోకేష్ పాదయాత్రకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ పాదయాత్రకు చాలా తేడా ఉందన్నారు మంత్రి జయరాం.. పాదయాత్ర అంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ కుటుంబానికే సొంతం అన్నారు.. చంద్రబాబు ప్రజలుకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పే ధైర్యం లేదన్న ఆయన.. 2024 ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. కాగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగేళ్లలో తొలిసారి మంత్రాలయం దర్శనానికి వచ్చారు జయరాం.. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం నేపథ్యంలో మంత్రి జయరాం మంత్రాలయం వెళ్లడం.. పీఠాధిపతి, మంత్రి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఎన్నిసార్లు సమాచారం పంపినా రాలేదని పీఠాధిపతి ప్రశ్నించారట.. అయితే, ఇప్పుడు రాఘవేంద్రస్వామి బలం కావాలని మంత్రి జయరాం కోరినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!