CM Jagan: రేపు ఏలూరులో పర్యటన.. రైతుల ఖాతాలో రూ. 5,500
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.10 గంటలకు గణపవరం చేరుకోనున్న సీఎం.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ముగిశాక తిరిగి 1 గంటకు తాడేపల్లికి చేరుకుంటారు.
ఈ కార్యక్రమం సందర్భంగానే సీఎం జగన్ నాలుగో ఏడాది మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ. 5,500 చొప్పున జమ చేయనున్నారు. గణపవరం నుంచి వర్చువల్‌గా ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున రైతులకు సీఎం జగన్ సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 31వ తేదీన కేంద్రం రూ. 2 వేలు చొప్పున పీఎం కిసాన్ నిధులు ఇవ్వనుంది. మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ చేయనున్నారు.
Also Read
- Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
- YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
- YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
తాజావార్తలు
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!