YS Jagan: నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

  • నేడు గవర్నర్ను కలవనున్న వైసీపీ అధినేత జగన్‌..
  • గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో భేటీ కానున్న వైఎస్‌ జగన్‌..
  • రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేయనున్న జగన్..
Jagan

Jagan

YS Jagan: వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు ఏపీ గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో సమావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్‌ భవన్‌కు వెళ్లి, గవర్నర్‌ను కలసి.. రాష్ట్రంలో టీడీపీ అరాచకాలపై కంప్లైంట్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసక పాలన గురించి వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్ కు వివరించనున్నారు.

Read Also: AP Govt: ఏపీలో పెండింగ్ బిల్లులు, పథకాల బకాయిలపై అధికారులు ఆరా..

అలాగే, వినుకొండలో వైసీపీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడంతో పాటు ఆ మర్నాడే పుంగనూరులో వైసీపీ పార్లమెంట్ సభ్యులు మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప కారును కాల్చి వేయడం.. సహా ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సంబంధించిన సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్‌ నజీర్ కు వైఎస్‌ జగన్‌ అందించనున్నారు.