Site icon NTV Telugu

YS Jagan: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తక్కువ ఆదాయ వృద్ది, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ ట్వీట్ చేశారు. రోజు రోజుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారింది.. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా పరిస్థితి ఉంది.. టీడీపీ కూటమి ప్రభుత్వ పని తీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే.. 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారు.. కానీ కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతుంది.

Read Also: Women marriage With AI: మగాళ్లపై విరక్తి చెందిన మహిళ.. ఓదార్పు కోసం ఏఐతో పెళ్లి..

అయినప్పటికీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందని ఎలా ప్రచారం చేస్తారు? అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించింది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1%గా లక్ష్యంగా పెట్టుకుంది.. కానీ, ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెప్తున్నాయి.. సంపద సృష్టి లేకపోవటంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది.. కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్దిలో వేగంగా పరుగులు పెడుతోందంటూ ఎలా మాట్లాడతున్నారు? అని జగన్ అడిగారు.

Exit mobile version