YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తక్కువ ఆదాయ వృద్ది, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ ట్వీట్ చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తోందని కాగ్ నివేదిక చెబుతున్నందున.. ఇప్పటికైనా మేధావులు స్పందించాలని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం కోరింది. రానున్న తరాలకు ఆస్తులకు బదులు అప్పులు ఇచ్చే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు మూల వ్యయాలకు కాకుండా.. రోజువారీ ఖర్చులకు సరిపోతున్నాయని, అప్పులు చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు…
టిడిపి సీనియర్ ఎంఎల్‌ఎ, పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఎపి ఆర్థిక నిర్వహణలలో 41వేల కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కులేఖ రాశారు. కాగ్ తరపున లతామల్లికార్జున్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్‌కు చాలా కాలం కిందటే రాసిన లేఖను తన ఫిర్యాదుతో జతచేశారు. ఈ 41 కోట్ల మొత్తానికి సంబంధించి సరైన లెక్కలు, రశీదులు వివరాలు లేవనిఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత దశలో కేంద్రం ఎపి ప్రభుత్వానికి రాసిన లేఖ ఒకటి…