ఇటీవల ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలితాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పదో తరగతి విద్యార్థులో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఉన్నట్టుండి ఈ జూమ్ మీటింగ్‌లో వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు విద్యార్థుల లాగిన్ ఐడీలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్‌లోకి వచ్చినట్లు టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే జూమ్ మీటింగ్‌లో వైసీపీ నేతలను చూసిన వెంటనే కాల్‌ను కట్ చేశారు నిర్వహకులు. అయితే.. నారా లోకేష్ ఇలా జూమ్ మీటింగ్‌లో కాదని.. డైరెక్ట్‌గానే మాట్లాడుతా అంటూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.