మిస్టరీగా మారిన ఒక మహిళ హత్యకేసుని చేధించారు పోలీసులు. మహిళ మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి వాటిని సూట్ కేసుల్లో పెట్టి పోలవరం కాలువ వద్ద పడేసిన ఘటన సంచలనం రేపింది.తూర్పుగోదావరిజిల్లా యర్నగూడెంలో తీవ్ర కలకలం రేపిన ఈ మిస్టరీ మర్డర్ కేసును చేధించిన పోలిసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. తూర్పుగోదావరిజిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం పోలవరం కుడి కాలువ సమీపంలోని బ్రిడ్జ్ వద్ద మహిళ మృతదేహాన్ని రెండు సూట్ కేసుల్లో పెట్టి పడేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళను హత్య చేసి అనంతరం రెండు ముక్కలుగా నరికి పొట్ట నుండి పై భాగం ఒకచోట, కాళ్ల నుండి కింది బాగం ను ఒక బ్యాగ్ లో పెట్టీ మరోచోటా పడేసారు. అదే బ్యాగ్ లో హత్యకు ఉపయోగించిన గీత కత్తి ,కత్తెరను సైతం పోలవరం కాలువలో గుర్తుతెలియని వ్యక్తుల పడేసారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. పోలవరం కాలువలో మృతదేహం ఉందని సమాచారంతో రంగంలోకి దిగిన పోలిసులు మృతదేహం రెండు భాగాలను వెలికి తీసి పోస్టుమార్టంకి పంపించారు. మిస్టరీగా మారిన కేసును చేధించేందుకు పోలిసులు మిస్సింగ్ కేసులపై దృష్టిపెట్టారు.
పోలిసులు విచారణ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగు చూసాయి. గోపాలపురానికి చెందిన కత్తెవ శ్రీదేవికి వెంకట సత్యనారాయణకు 36ఏళ్ళ క్రితం పెళ్లి అయింది. సత్యనారాయణ టైలరింగ్ చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. చాలా కాలం నుండి భార్యపై అనుమానంతో మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈక్రమంలో భార్యపై కక్షపెంచుకున్న సత్యనారాయణ భార్య శ్రీదేవి తలని గోడకి కొట్టి అనంతరం కత్తితో పీక నరికి చంపేసాడు.
Read Also:Dropped Temperatures: వణుకుతున్న తెలంగాన.. చంపేస్తున్న చలి
మృతదేహాన్ని మాయం చేసేందుకు కత్తెరతో శరీరాన్ని రెండు భాగాలుగా చేసి సూట్ కేసులో పెట్టి అతడి మేనల్లుడితో కలసి మృతదేహాన్ని బైక్ పై పెట్టుకుని యాదవోలు, చిన్నాయగూడెం మీదుగా యర్నగూడెం శివారు పోలవరం కుడి కాలువలో రెండు వేరు వేరు చోట్ల పడేశాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్ళిపోయాడు.. రెండు రోజుల తర్వాత గోపాలపురం పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదంటూ అతని తల్లితో కలసి వెళ్లి ఫిర్యాదు చేశాడు..
పోలిసులు విచారణ వేగవంతం చేయడం, అదేసమయంలో పోలవరం కాలువ వద్ద మృతదేహం లభ్యం కావడంతో భయపడిన సత్యనారాయణ వీఆర్వో వద్దకు వెళ్ళి లొంగిపోయాడు. కుటుంబ కలహాల నేపద్యంలో భార్యను హత్యచేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ మీడియాకు వివరించారు. హత్యకేసుతో సంబంధం ఉన్న మృతురాలి భర్త ముమ్మిడి నాగరాజు, అత్త ముమ్మిడి ధనలక్ష్మి తో పాటు మేనల్లుడు గొన్నూరి సూరిబాబులను అరెస్ట్ చేయడంతో పాటు హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు డీఎస్పీ శ్రీనాథ్.
Read Also: Women Crime: ఖతర్నాక్.. బట్టల దుకాణంలో మహిళల హల్ చల్