గొల్లపూడిలో అరెస్ట్ చేసిన దేవినేని ఉమా అనుచరుడు ఆలూరి హరికృష్ణ (చిన్నా)ను భవానీపురం పోలిస్ స్టేషన్ కు తరలించారు. 41 నోటీస్ ఇచ్చి చిన్నాను విడుదల చేశారు పోలీసులు. మరోసారి పిలిచినప్పుడు స్టేషన్ కు రావాలని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నా విడుదల అయిన అనంతరం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడారు.
టీడీపీ నాయకుల పై అక్రమ కేసులు… ఏం సాధించవ్ జగన్…? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్రానికి అంబేద్కర్ రాజ్యాంగం అవసరం. పోలవరం నిర్వాసిత గిరిజన కుటుంబాలకు అందాల్సిన డబ్బులు పక్కదారి పట్టించారు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ కాపాడుతున్నారు. అంబటి…. నువ్వొక ఇరిగేషన్ మంత్రివా? రాష్ట్రంలో అందరూ బుద్ధిలేని మంత్రులే అని మండిపడ్డారు.
చేతకాకపోతే తప్పుకోండి…. దమ్ముంటే ధైర్యం వుంటే ఎన్నికలకు రండి. అసమర్ధుల పాలనలో రాష్ట్రం ఉంది. చంద్రబాబు పాలనలో నదుల అనుసంధానం జరిగింది. బస్సు యాత్ర కాదు… ఏ యాత్ర చేసిన గాలి ప్రభుత్వం… గాలికే. రాష్ట్రంలో ఏ పంట పండించే రైతు బాగున్నాడు. చివరకి వైసీపీ నాయకులకు కాశీ యాత్రే అని ఎద్దేవా చేశారు.