Site icon NTV Telugu

Kuppam Crime: అనైతిక బంధం.. రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య..!

Supari

Supari

ఈ మధ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. అడ్డుగా ఉన్న భర్తల ప్రాణాలు తీసిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి… కుటుంబం కోసం సంపాదనతో భర్త బిజీగా ఉంటే… మరో వ్యక్తితో రంకు నడుపుతోన్న కొందరు ముదురు మహిళలు.. ప్రియుడిని విడిచి ఉండలేక.. అడ్డుగా ఉన్న భర్తనే లేకుండా చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి మరో ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది… ప్రియుడు మోజులో పడిపోయిన ఓ వివాహిత.. భర్తను హత్య చేయించింది.. ప్రియురాలి కోసం ఐదు లక్షల రూపాయులు సుపారీ ఇచ్చి.. ఆమె భర్తను హత్య చేయించాడు ప్రియుడు.. ఏదైనా.. దొంగతనం, వివాహేతర సంబంధాలు ఎక్కువ కాలం గుట్టుగా సాగవు అంటారు కదా.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

Read Also: Ambati Rambabu Counter attack: హరీష్‌రావుపై అంబటి కౌంటర్‌ ఎటాక్.. చర్చకు సిద్ధమా..?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 25వ తేదీన గేరిగేచినేపల్లి గ్రామానికి చెందిన హరీష్ కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.. తన భర్త కనిపించకుండా పోయాడంటూ అతని భార్య స్నేహ పోలీసులను ఆశ్రయించింది.. అయితే, ఈ నెల 28వ తేదీన గణేష్ పురం అటవీ ప్రాంతంలో హరీష్ కుమార్ మృతదేహం లభించింది… దీనిపై ఆరా తీసిన పోలీసులు అసలు రహస్యాన్ని బయటపెట్టారు.. సతీష్ కుమార్ భార్య స్నేహకు, టేకుమాను తాండా గ్రామానికి చెందిన సతీష్ నాయక్ తో పరిచయం ఏర్పడకింది.. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.. ఇక, తమ సంబంధానికి భర్త సతీష్ కుమార్ అడ్డు వస్తున్నాడని.. అతడిని అడ్డుతొలగించుకోవాలని ఈ అనైతిక సంబంధం నెరుపుతోన్న జంట ప్లాన్‌ చేసింది.. ప్రియురాలి కోసం వీర్నమల తాండ గ్రామానికి చెందిన నలుగురికి 5 లక్షల రూపాయలు సుఫారీ ఇస్తానని చెప్పి.. సతీష్ కుమార్‌ని హత్య చేయించాడు సతీష్ నాయక్‌.. మొత్తగా సతీష్‌ కుమార్‌ మృతదేహం లభ్యం కావడం.. అతని భార్య ఫిర్యాదుతో అనుమానం వచ్చిన పోలీసులు.. దర్యాప్తు జరపగా.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు… ఈ హత్య వ్యవహారం వెలుగు చూసింది.. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేసిన కుప్పం పోలీసులు, రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version