✪ నేడు దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు… దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్.. రాష్ట్రపతి గౌరవ వందనంతో ప్రారంభం కానున్న పరేడ్… పాల్గొననున్న 16 కవాతు విభాగాలు… 75 విమానాలతో వాయుసేన విన్యాసాలు
✪ హైదరాబాద్: ఉ.7 గంటలకు రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ డే ఉత్సవాలు… జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న గవర్నర్ తమిళిసై
✪ విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నేడు గణతంత్ర వేడుకలు… ఉ.9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న గవర్నర్ హరిచందన్, ఉ.9:41 గంటలకు ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం… రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరుకానున్న సీఎం జగన్