NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ.. ఉదయం శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పణ.. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
* బాపట్ల జిల్లా: నేడు రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన కుటుంబాలను పరామర్శించనున్న టీడీపీ నేతలు.. మద్యం మరణాలపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన
* నంద్యాల: నేడు ఆత్మకూరులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
* శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం పట్టణంలో నేడు టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం
* నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే.. ఈ ఉదయం వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి భద్రాచలం ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన.. ఉ.9:30 గంటలకు భద్రాచలంలో జిల్లా అధికారులతో సమీక్ష .. ఉ.9:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఏటూరునాగారం వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన.. ఉ.11 గంటలకు ఏటూరునాగారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం ..ఉ.11:45 గంటలకు ఏటూరునాగారం నుంచి హెలికాప్టర్ హైదరాబాద్‌కు ప్రయాణం
* నేడు భద్రాద్రి కొత్తగూడెంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటన.. భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న గవర్నర్.. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్న గవర్నర్ తమిళిసై
* మాంచెస్టర్: నేడు భారత్-ఇంగ్లండ్ మూడో వన్డే.. సాయంత్రం 3:30 గంటలకు మ్యాచ్