* నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 17 నుంచి 22 వరకు తెలంగాణలో పర్యటించనున్న రాష్ట్రపతి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ముర్ము..
* నేడు తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు, ఫలితాలు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్న పోలింగ్.. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్.. 3,753 సర్పంచ్, 28, 410 వార్డు స్థానాలకు పోలింగ్.. మూడో విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..
* నేడు జిల్లా కేంద్రాల్లో నిరసనలకు ఏఐసీసీ పిలుపు.. మహాత్మాగాంధీ చిత్రపటాలతో డీసీసీల ఆధ్వర్యంలో నిరసనలు.. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ నేతల ఆగ్రహం..
* నేడు ఏపీ సచివాలయంలో 5వ కలెక్టర్ల సదస్సు.. ఉదయం 10 గంటలకు సచివాలయంలో ప్రారంభం కానున్న కలెక్టర్ల సదస్సు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
* నేడు నిడదవోలు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం.. కానూరు Why-Not ఫంక్షన్ హాల్ లో జరగనున్న భేటీ.. ఈనెల 20వ తేదీన జరగనున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనపై చర్చ.. మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం..
* నేడు ఢిల్లీకి మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్.. ఉదయం 11 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్న సత్యకుమార్, మాధవ్.. ఈ నెల 25న అమరావతిలో జరిగే వాజ్ పేయి శతజయంతి సభకు.. అమిత్ షాను ఆహ్వానించనున్న మంత్రి సత్యకుమార్, మాధవ్..
* నేడు వేలూరు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించనున్న రాష్టపతి ద్రౌపది ముర్ము.. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి వాయుసేన హెలికాప్టర్ లో శ్రీపురం ఆలయానిక వెళ్ళనున్న రాష్టపతి..
* నేడు భారత్- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20.. లక్నో వేదికగా రాత్రి 7 గంటలకి మ్యాచ్..