* నేడు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం.. ఉదయం ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఈ ఒప్పందం.. కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. విశాఖను కృత్రిమ మేధా నగరంగా రూపొందించడంలో తొలి అడుగు.. ఏపీని కృత్రిమ మేధస్సు, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు చర్యలు.. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం..
* నేడు విశాఖలో మంత్రి సంధ్యారాణి పర్యటన.. kGHలో చికిత్స పొందుతున్న కురుపాం ఆశ్రమ పాఠశాల విద్యార్ధినుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్న మంత్రి..
* నేడు రాజమండ్రికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాక.. ఉదయం 8:30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కిరణ్ కుమార్.. ఉదయం 9 గంటలకు రాజమండ్రి క్వారీ సెంటర్లోని బీజేపీ కార్యాలయంలో జరగనున్న పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ సీఎం..
* నేడు ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్..
* నేడు విజయవాడ మెట్రోకు టెండర్లు.. రూ.4,500 కోట్ల వ్యయంతో టెండర్లు పిలుపు.. ఏలూరు, బందరు రోడ్ రెండు కారిడార్లకు కలిపి సింగిల్ టెండర్.. టెండర్లలో పాల్గొననున్న బడా కంపెనీలు.. ప్రీ బిడ్డింగ్ మీటింగ్‌లో పాల్గొననున్న 10కి పైగా కంపెనీలు.. జాయింట్ వెంచర్ విధానంలో పోటీకి రంగంలోకి దిగనున్న కంపెనీలు..
* నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు.. నీల్వాయిలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న రామచందర్ రావు..
* నేడు రైతులకు వేరుశనగా విత్తనాల పంపిణీ.. సచివాలయంలో ప్రారంభించనున్న మంత్రి తుమ్మల.. ఈరోజు 8 జిల్లాల్లో 100 శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరా.. రైతు వేదికల దగ్గర పంపిణీ చేయనున్న ప్రజాప్రతినిధులు..
* తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణలో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఏపీలో ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..
* నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంకతో తలపడబోతున్న న్యూజిలాండ్.. మధ్యాహ్నం 3 గంటలకి కొలంబోలో మ్యాచ్..
* నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ.. స్కాట్లండ్ జోడితో తలపడనున్న సాత్విక్ జోడీ..