Missing Women Killed: యువతి అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ.. సూత్రధారులు ప్రేమికులే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Women Killed: ఏడాది క్రితం ఓ యువతి అదృశ్యమైన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియురాలే అసలు సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. పథకం ప్రకారమే ప్రియుడు ప్రియురాలు కలిసి ఆయువతిని చంపేసారని విచారణలో తేలింది. ఈఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జరిగింది.
చింత పల్లి ఏఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. జి.మాడుగుల మండలం లువ్వసింగి పంచాయతీ చిట్టంపుట్టు గ్రామానికి చెందిన కోరాబు లక్ష్మి, చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ సంపంగి పుట్టుకు చెందిన వండలం గోపాల్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం గోపాల్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు మందలించి, గత ఏడాది ఆగస్టులో అదే గ్రామానికి చెందిన చెదల కాంతమ్మ(20)తో వివాహం చేసేందుకు నిర్ణయించడంతో.. కాంతమ్మతో గోపాల్ సన్నిహితంగా ఉండడాన్ని లక్ష్మి సహించలేక పోయింది. గోపాల్ ను నిలదీసింది. దీంతో అసలు ప్లాన్ ను లక్ష్మి ముందు పెట్టాడు గోపాల్ సన్నిహితంగా వుండి కాంతమ్మను చంపేసి ఇద్దరు కలిసి వుండటానికే ఇదంతా చేస్తున్నట్లు చెప్పాడు. దీనికి సరే అన్న లక్ష్మి.. గత ఏడాది సెప్టెంబరు తొమ్మిదో తేదీన గోపాల్, లక్ష్మి కలిసి కాంతమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడే కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
Also Read
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
- Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
- Nandi Idol Damaged: భీమవరం పంచారామ క్షేత్రంలో అపచారం.. నంది విగ్రహం ధ్వంసం..
తరువాత తనను ఇంటి వద్ద దిగబెట్టాలని లక్ష్మీ కోరింది. దీంతోముగ్గురూ కలిసి సంపంగిపుట్టు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని చిట్టంపుట్టు వెళ్లారు. వినాయక చవితి కావడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మండపంలో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్లారు. అయితే.. లక్ష్మి, కాంతమ్మ ఇంటి లోపలకు వెళ్లగా, గోపాల్ బయట ఉన్నాడు. కాంతమ్మ కూర్చోని ఉండగా లక్ష్మి గొడ్డలి తీసుకుని తల వెనుక భాగంలో బలంగా కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయి గట్టిగా కేకలు వేసింది. గోపాల్ వెంటనే లోపలకు వచ్చి కాంతమ్మ నోరు, ముక్కు గట్టిగా నొక్కి పెట్టాడు లక్ష్మి మరోమారు కాంతమ్మ. తలపై గొడ్డలితో బలంగా కొట్టింది. దీంతో కాంతమ్మ అక్కడిక్కడే మృతిచెందింది. ఇద్దరూ కలిసి కాంతమ్మ మృతదేహాన్ని రగ్గులో చుట్టి, సుమారు వందడుగుల దూరంలో ఒక గోతిలో పూడ్చివేశారు.
కుటుంబసభ్యులు కాంతమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. లక్ష్మి.. గోపాల్న ప్రశ్నించారు వారిద్దరు పొంతన లేని సమాధానాలివ్వడంతో మృతిరాలి తల్లి నారాయణమ్మ అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదుచేశారు. మూడు నెలల అనంతరం గోపాల్, లక్ష్మి కలిసి తూర్పుగోదావరి జిల్లా అలమూరు వెళ్లి సహజీవనం చేయసాగారు. ఈ నేపథ్యంలో, కాంతమ్మ మిస్సింగ్ కేసు విచారణను వేగవంతం చేయాలన్న జిల్లా ఎస్పీ ఎస్. సతీ కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి ఏఎస్సీ పర్యవేక్షణలో అన్నవరం ఎస్ఐ సాయి రంగంలోకి దిగి, గోపాల్, లక్ష్మి ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడకు వెళ్లి కాంతమ్మ హత్య గురించి విచారించడంతో వారు నేరం ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారంతో కాంతమ్మ మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. నిందితులు గోపాల్, లక్ష్మీ లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!