గంజాయి అరికట్టడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సీపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. ఏఆర్ గ్రౌండ్లో జరిగిన పరివర్తన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కమిషనరేట్ పరిధిలో గంజాయి సేవిస్తున్న, సరఫరా చేస్తు న్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి సేవిం డచడం వలన జరిగే అనర్థాలన ఆయన వివరించారు. బెజవాడలో గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో వంద ల సంఖ్యలో యువకులు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం.
గంజాయి సేవించే వారిలో ఎక్కువుగా యవకులే ఉండటం ఆందోళన కలిగి స్తుందన్నారు. గంజాయికి అలవాటు పడిన యువకులు కొరియ ర్ బాక్స్ గా మారుతున్నారన్నారు. విశాఖ మన్యం నుంచి గంజాయి తీసుకొచ్చి కొందరూ నగరంలో సరఫరా చేస్తున్నారన్నారు. గంజాయి మత్తుకు బానిసలుగా మారితే జీవితం అంధకారంలోకి వెళ్తుందన్నారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి కౌన్సిలంగ్ ద్వారా మంచి మార్పు వస్తుందని బత్తిన శ్రీనివాస్‌లు అన్నారు.